Telangana Martial Memorial: అమరవీరుల స్మారక కట్టడంలో ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయా.. తెలిస్తే షాకే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telangana Martial Memorial: అమరవీరుల స్మారక కట్టడంలో ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయా.. తెలిస్తే షాకే!

    Telangana Martial Memorial: అమరవీరుల స్మారక కట్టడంలో ఇన్ని ప్రత్యేకలు ఉన్నాయా.. తెలిస్తే షాకే!

    June 22, 2023

    తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి. నేటి తెలంగాణ వెలుగుల ప్రస్థానానికి నాటి ఆత్మబలిదానాల చీకటి అధ్యాయమే సోపానం. ఈ నేపథ్యంలో అమరులను స్మరించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే శాశ్వతంగా, కలకాలం గుర్తుండిపోయేలా తెలంగాణ రాష్ట్ర పాలనాసౌధం(సెక్రటేరియట్) ఎదుట అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించింది. June 22న సాయంత్రం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అత్యాధునిక హంగులతో అమరవీరుల కీర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా జ్యోతిని తీర్చిదిద్దింది. మరి, ఈ స్మారక చిహ్నం విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందామా.  

    అంతస్తులు: 6

    నిర్మాణ విస్తీర్ణం: 2.85లక్షల చదరపు అడుగులు

    దీపం ఎత్తు: 26 మీటర్లు

    స్టీలు వినియోగం: 1500 టన్నులు

    ఖర్చు: రూ.178 కోట్లు

    మట్టి దీపం డిజైన్..

    అమరవీరులకు గుర్తుగా స్మారక చిహ్నాన్ని నిర్మించాలని సంకల్పించింది నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, తొలుత నక్షత్ర గుర్తు డిజైన్‌ని పరిశీలించారు. అనంతరం, తెలంగాణ కళాకారుడు రమణారెడ్డి మిర్రర్ ఇమేజ్ మట్టి దీప ఆకృతిని సిఫార్సు చేశారు. దీంతో స్మారక చిహ్నానికి 2017లోనే భూమి పూజ చేశారు. అలా స్మారక చిహ్న నిర్మాణానికి తొలి అడుగులు పడ్డాయి. 

    ఎత్తైన నిర్మాణం..

    అమరవీరుల స్మారక చిహ్నాన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించారు. మిర్రర్ ఇమేజ్ స్టీలు నిర్మాణాల్లో ప్రపంచంలోనే ఇది పెద్దది. దుబాయ్‌లోని ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ ఎత్తు 12 మీటర్లు కాగా, చైనాలోని బిగ్ ఆయిల్ బబుల్ ఎత్తు 15 మీటర్లు. వీటి కన్నా అమరవీరుల స్మారక చిహ్నం పెద్దది. 

    స్పెషల్ స్టీలు

    దీపం ఆకారం డిజైన్ కోసం ప్రత్యేక స్టీలును వినియోగించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసి దుబాయ్‌లో తయారు చేయించారు. అతుకులు ఏర్పడకుండా రూపొందించి ఈ స్టీలును హైదరాబాద్‌కి పంపించారు. జ్యోతి రంగు కోసం కార్బన్ స్టీలుని వినియోగించారు. 

    రెండు రెస్టారెంట్లు

    స్మారక చిహ్నాన్ని చూడటానికి వచ్చే పర్యటకుల కోసం ప్రత్యేకంగా 2 రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. మూడో ఫ్లోర్, టెర్రస్‌పై ఇవి ఉన్నాయి. మూడో ఫ్లోర్‌లో కిచెన్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్‌లో కూర్చుని సెక్రటేరియట్, అంబేడ్కర్ విగ్రహం అందాలను చూసేలా వ్యూ పాయింట్‌ని తీర్చిదిద్దారు. లోయర్ బేస్‌మెంట్‌లో భారీ కిచెన్‌ని సిద్ధం చేశారు. సుమారు 1000 మందికి సరిపడేలా స్టౌలు, ఇతర పరికరాలను అమర్చారు. మూడో ఫ్లోర్‌లోని కిచెన్‌లో మాత్రం గ్యాస్‌కు బదులుగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను వాడారు.

    ఏ ఫ్లోరులో ఏముందంటే? 

    మొదటి రెండు లోయర్ బేస్‌మెంట్లను పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో లైబ్రరీ, ఇతర ఎగ్జిబిషన్ల కోసం స్థలం కేటాయించారు. ఫస్ట్ ఫ్లోర్‌లో అమరవీరుల ఫొటో గ్యాలరీతో పాటు 70 మంది కూర్చునేలా థియేటర్‌ని ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో 500 మంది కూర్చునేందుకు వీలుగా ఓ కన్వెన్షన్ సెంటర్ ఉంది. మూడో అంతస్తులో రెస్టారెంట్, వ్యూ పాయింట్, సీటింగ్ ఏరియా ఉన్నాయి. దీనికి అనుసంధానంగా నాలుగో అంతస్థు ఉంటుంది. గ్లాస్ రూఫ్‌ని కలిగి ఉంటుంది. దీనిని కూడా రెస్టారెంట్‌ కోసం కేటాయించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version