• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓటర్లకు రామ్‌గోపాల్‌ వర్మ సూచనలు

    హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.

    రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

    తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ నార్త్‌లో 4.35సెం.మీ.లు, నిజామాబాద్‌లో 3.93సెం.మీ.లు, నిజాంపేటలో 3.58సెం.మీ.లు, కల్దుర్తి, గోపన్‌పల్లిలలో 3.45సెం.మీ.లు,వర్షాపాతం నమోదైంది

    డీప్‌ఫేక్‌పై శ్రేణులు అప్రమతంగా ఉండండి: కేటీఆర్

    డీప్‌ఫేక్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఓటర్లను చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు.

    రూ.5కోట్ల నగదు పట్టివేత

    HYD: పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బొటానికల్‌ పార్కు నుంచి చిరాక్‌ పబ్లిక్‌ స్కూల్‌ వైపు వెళ్తున్న కారును తనికీ చేసిన పోలీసులు రూ.5 కోట్లు పట్టుకున్నారు. పట్టుబడిన నగదును ఐటీశాఖకు అప్పగించారు.

    కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు: KTR

    తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు, ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు వివరించారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కేటీఆర్ సూచించారు.

    కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లే వస్తాయి: KCR

    ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తామని సీఎం కేసీఆర్ జోష్యం చెప్పారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

    కాంగ్రెస్‌కు ఓటేసి ఆగం కావొద్దు: హరీశ్‌‌రావు

    కాంగ్రెస్‌కు అధికారమిచ్చి ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్‌నే కాంగ్రెస్ ఇస్తానంటోందని తెలిపారు. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని మంత్రి చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ఉపన్యాసాలతో ఊదరగొట్టారని విమర్శించారు.

    బీజేపీని గెలిపిస్తే అయోధ్య దర్శనం ఉచితం: అమిత్ షా

    తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. గద్వాలలో సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో తమ పార్టీ గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీ సీఎంని చేసి తీరుతామని చెప్పారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పి చేయలేదని చెప్పారు. రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదని అమిత్ … Read more

    పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా?: KTR

    రైతులను ఇబ్బంది పెట్టేందుకే కాంగ్రెస్‌ పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కామారెడ్డిలో రోడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు బీఆర్‌ఎస్ రైతులకు మేలు చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పట్వారీ వ్యవస్థ కావాలా? ధరణి కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 24 గంటల కరెంట్‌ కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయాలని కోరారు.

    విజయశాంతికి కాంగ్రెస్ కొత్త బాధ్యతలు

    కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీజేపీని వీడి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రచార, ప్లానింగ్‌ కమిటీని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. అందులో15 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రచార, ప్లానింగ్‌ కమిటీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతలను విజయశాంతికి అప్పగించింది. కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, రామ్మూర్తి నాయక్‌, అలీ బిన్‌ ఇబ్రహీం, తదితరులను నియమించింది.