Tilak Varma : టీమ్‌ఇండియా ఆశాకిరణంగా తెలుగోడు.. IPLలో అదరగొడుతున్న తిలక్‌ వర్మ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tilak Varma : టీమ్‌ఇండియా ఆశాకిరణంగా తెలుగోడు.. IPLలో అదరగొడుతున్న తిలక్‌ వర్మ

    Tilak Varma : టీమ్‌ఇండియా ఆశాకిరణంగా తెలుగోడు.. IPLలో అదరగొడుతున్న తిలక్‌ వర్మ

    April 14, 2023

    తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. టీమ్‌ఇండియా మ్యాచ్‌ ఉందంటే ఎంత ముఖ్యమైన పని అయినా పక్కన పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి తెలుగు ఆడియన్స్‌ను ఎప్పటినుంచో ఓ బాధ వెంటాడుతోంది. వీవీఎస్‌ లక్షణ్‌ తర్వాత ఆ స్థాయిలో మనవాడు టీమ్‌ఇండియాలో లేడే అని ఆవేదన చెందుతున్నారు. అంబటి రాయుడు రూపంలో ఓ హోప్‌ దొరికినా అది ఎంతో కాలం నిలవలేదు. హైదరాబాది పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌ఇండియాలో కీలకపాత్ర పోషిస్తున్నా… లక్ష్మణ్‌ లాంటి బ్యాటర్‌ భారత జట్టులో లేడే అని ఆందోళన చెందుతున్నారు. అయితే అటువంటి వారికి తిలక్‌ వర్మ రూపంలో ఓ కొత్త ఆశాకిరణం దొరికింది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న హైదారబాది బ్యాటర్‌ తిలక్‌ వర్మ టీమ్‌ఇండియాలోకి కచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

    ప్రస్తుతం తిలక్ వర్మ పేరు ఐపీఎల్‌లో మార్మోగుతోంది. గత ఏడాది ముంబయి ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తిలక్.. తనదైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో కూడా ముంబయి తరపున అదరగొడుతున్నాడు. ఆ జట్టు తరపున ఆడిన తొలి మూడు మ్యాచుల్లో  తిలక్‌ 158.06 స్టైక్‌ రేట్‌తో ఏకంగా 147 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. తిలక్‌ తర్వాత రోహిత్‌ 87 పరుగులతో సెకండ్ హైయస్ట్ బ్యాటర్‌గా ఉన్నాడు. వీరి పరుగుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి చూస్తే ముంబయి జట్టుకు తిలక్‌ ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో రాణించిన తిలక్.. రోహిత్‌తో కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తుండంతో తిలక్‌ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తుతున్నారు. #Tilakvarma పేరుతో పోస్టులు పెడుతున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం. 

    టెక్నిక్‌, నైపుణ్యం, టెంపర్‌మెంట్‌ కలగలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ అని ముంబయి ఇండియన్స్‌ జట్టు ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టును నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. 

    తిలక్‌ వర్మను ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ ఇంటర్యూ చేసిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. రోహిత్‌తో కలిసి ఆడాలన్న తన చిన్నప్పటి కోరిక ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తీరిందని తిలక్‌ తెలిపాడు.

    తిలక్‌ వర్మ ఫ్యూచర్‌ ఇండియన్ క్రికెటర్ అంటూ స్పోర్ట్స్‌కీడా తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ బ్యాంటింగ్‌ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. 

    తిలక్‌వర్మపై మాజీ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించిన పోస్టు కూడా నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే 6-8 నెలల్లో తిలక్‌ భారత్‌ తరపున టీ-20 ఆడకపోతే అది తనను చాలా ఆశ్చర్యపరుస్తుందని

    పేర్కొన్నారు. 

    2023 ఐపీఎల్‌ సీజన్‌లో తిలక్‌ టాప్‌ స్కోరర్‌గా ఉంటాడని ఇప్పటినుంచే నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రుతురాజ్‌, తిలక్‌వర్మ, విరాట్‌ కోహ్లీలో ఎవరూ హైయస్ట్‌ స్కోరర్‌గా ఉంటారని విస్డెన్‌ ఇండియా ఓ కాంటెస్ట్‌ కూడా నిర్వహించింది.

    ముంబయి తరపున తిలక్‌ క్రికెట్‌ ఆడుతున్న ఫొటోలు ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి.

    తిలక్‌.. టీమ్ఇండియా ఫ్యూచర్‌ హీరో అంటూ ఆ ఫొటోలకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    ముంబయి ఆడిన తొలి మూడు మ్యాచుల్లో తిలక్‌ వర్మ వరుసగా 84(46), 22(18), 41(29) రన్స్‌ చేశాడు. 

    టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా తిలక్‌వర్మపై ప్రశంసలు కురిపించాడు. చిల్లింగ్‌ విత్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా అంటూ ట్వీట్‌ చేశాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version