రానా, సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘విరాట పర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. కరోనా కారణంగా సినిమా గత రెండు సంవత్సరాలుగా వాయిదాపడుతూ వస్తుంది. చాలా సార్లు ఓటీటీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు థియేటర్లలోనే విడుదల చేసేందుకు వేచిచూశారు. ఎట్టకేలకు నేడు ప్రపంచవ్యాప్తంగా మూవీ థియేటర్లలో రిలీజైంది. మరి వారి నమ్మకం నిజమైందా? సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటి ?తెలుసుకుందాం
కథేంటంటే..
ములుగు జిల్లాకు చెందిన వెన్నెల (సాయిపల్లవి) పుట్టుకలోనే విప్లవం ఉటుంది. అదే వాతావరణంలో పెరిగిన ఆమె మావోయిస్ట్ దళ నాయకుడు రవన్న(రానా) రాసిన రచనలు చదివి వాటితో ప్రేమలో పడుతుంది. తల్లిదండ్రులు ఆమె బావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి నిశ్ఛయిస్తారు. దానికి అంగీకరించని వెన్నెల రవన్న దగ్గరికి వెళ్లిపోతానని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అక్కడినుంచి అష్టకష్టాలు పడి పోలీసుల బారీ నుంచి తప్పించుకొని రవన్నను కలుసుకంటుంది. మరి ఆమె ప్రేమను రవన్న అంగీకరిస్తాడా దళంలో చేరిన ఆమెకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చివరికి దళం సభ్యులే ఆమెను ఎందుకు చంపారు అని వెండితెరపై చూడాల్సిందే
విశ్లేషణ:
ఇదివరకు నక్సలిజం నేపథ్యంలో సినిమాలు వచ్చినా..నక్సలిజానికి సినిమాకు ముడిపెట్టిన సినిమాలు రాలేదు. ఇదొ ఒక యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించిన కథ. 1992లో వరంగల్‌లో ఒక మహిళను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటనను కథగా తీసుకొని దర్శకుడు అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా కథలో వచ్చే మాటలు అందర్నీ ఆలోజింపచేసేలా, గుర్తుండిపోయేలా ఉంటాయి. ఈ కథలో తప్పు ఎవరిది పోలీసులదా నక్సలైట్లదా అనే అంశాన్ని దర్శకుడు సున్నితంగా తెరపై చూపించాడు. ఇక వెన్నెల రవన్నను ఎంత గాఢంగా ప్రేమిస్తుందో ప్రతి ఒక్కరు దాన్ని ఫీలయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.
మొదటి భాగం మొత్తం వెన్నెల చుట్టూ తిరుగుతుంది. ఆమె పుట్టుక నుంచి, చుట్టూ ఉన్న వాతావరణం, రవన్నతో ప్రేమలో పడటం, అతడిని వెతక్కుంటూ ఇళ్లు వదిలి రావడం ఆమె కథను చూపించాడు. ఇంటర్వెల్‌లో ఆమె పోలీసులకు దొరికిపోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుంది. రెండో భాగంలో దళంలో చేరి వారితో పాటు పోరాటాలు చేస్తుంది. ప్రేమను తెలియజేసే సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్‌లోనే సాయిపల్లవి మెప్పించింది. రవన్నగా రానా ఎంట్రీ అదిరిపోతుంది. మావోయిస్ట్ దళ సభ్యులైన ప్రియమణి, నవీన్ చంద్ర కథను మలుపు తిప్పుతారు. చివరికి క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
సినిమా మొత్తం సాయిపల్లవి తన భుజాలపై నడిపించిటన్లు అనిపిస్తుంది. ఇది వెన్నల ప్రేమ కథ అని మొదటినుంచి చెప్తున్నారు. దానికి ఆమె సంపూర్ణంగా న్యాయం చేసింది. కొన్నిసార్లు సన్నివేశాలు కాస్త రిపీటెడ్‌గా అనిపించినా ఆమె నటనతో ఎక్కడా బోర్ కొట్టకుండా చేసింది. ఇక రానా రవన్నగా గంభీరంగా తన పాత్రలో ఒదిగపోయాడు. ప్రియమణి, రాహుల్ రామకృష్ణ, నందితా దాస్, నివేతా పేతురాజ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ తమ పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక విషయాలు:
సురేశ్ బొబ్బిలి అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంది డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
బలాలు:
మాటలు
సాయిపల్లవి, రానా
యదార్థ సంఘటన
బలహీనతలు:
కొన్ని రిపీటెడ్ సీన్స్
రెండో భాగం కాస్త నెమ్మదించడం
రేటింగ్: 3.5/5