WHO IS KARNATAKA CM: అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. కౌన్ బనేగా కన్నడ సీఎం?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • WHO IS KARNATAKA CM: అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. కౌన్ బనేగా కన్నడ సీఎం?

    WHO IS KARNATAKA CM: అసలు కథ ఇప్పుడే మెుదలైంది.. కౌన్ బనేగా కన్నడ సీఎం?

    May 13, 2023

    ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మెుత్తం 224 స్థానాలకు గాను136 గెలిచి విజయదుందిభి మోగించింది. అధికార భాజపా 64 సీట్లతో సరిపెట్టుకోగా JDS 20, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 114 మ్యాజిక్‌ ఫిగర్‌ను కాంగ్రెస్‌ అధిగమించడంతో ఆ పార్టీ తరపున సీఎంగా ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేసులో కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ D.K. శివకుమార్‌ (60), సీనియర్ నేత సిద్దరామయ్య (75)లు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే సీఎం అయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయి. దీంతో యావత్‌ దేశం దృష్టి వీరిద్దరిపై పడింది. అటు కాంగ్రెస్ అదిష్టానం కూడా కర్ణాటకపై ఫోకస్‌ పెట్టింది.   

    ఇద్దరూ.. ఒక్కటై..!

    కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో సీనియర్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తీవ్రంగా శ్రమించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. సీఎం ఎవరు అవుతారన్నది ముఖ్యం కాదని.. అవినీతిమయమైన భాజపా సర్కార్‌ కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమని ఇరువురు నేతలు పదే పదే చెప్తూ వచ్చారు. దానికి తగ్గట్లే ఎలాంటి బేషజాలాలకు వెళ్లకుండా డీకే శివకుమార్‌, సిద్దరామయ్యలు పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల సమయంలో వారు చేసిన కృషి వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగల్గింది. అటువంటి నేతల్లో ఒకరికి మాత్రమే సీఎం పదవి ఇస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు చెలరేగుతాయోనని శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 

    సిద్దరామయ్య వైపే మెుగ్గు!

    2023 శాసనసభ ఎన్నికలే తనకు చివరివని ఇప్పటికే సిద్దరామయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన్నే సీఎంగా నిలబెట్టి ఘన వీడ్కోలు పలకాలని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇక తన తండ్రిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయనే సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అద్భుత పాలన అందించారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సైతం సిద్ధరామయ్య వైపే మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం.  క‌ర్ణాట‌క సీఎంగా సిద్ధిరామ‌య్య‌కే ఎక్కువ ఛాన్సు ఉంద‌ని పార్టీలోని వ‌ర్గాలు చెబుతున్నాయి. డీకే శివ‌కుమార్‌కు తొలుత ఓ ఉన్న‌త పోస్టు ఇచ్చినా.. ఆ త‌ర్వాత ఆయ‌నే ఆ రాష్ట్ర సీఎం అవుతార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఓవర్ టూ హైకమాండ్‌..

    కర్ణాటకలో తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇప్పటివరకూ కాంగ్రెస్‌ హైకమాండ్ ఎక్కడా చెప్పలేదు. హస్తం పార్టీ అగ్రనేతలు రాహుల్‌, సోనియాలు కర్ణాటక ప్రచారాల్లో పాల్గొన్నప్పటికీ సీఎం అభ్యర్థిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమ సీఎంను ఎన్నుకునేందుకు ఆదివారం కర్ణాటక సీఎల్పీ నేతలు సమావేశం కాబోతున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో తమ నాయకుడ్ని ఎన్నుకోనున్నారు. దీంతో రేపే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటివరకూ హైకమాండ్ చెప్పిన వ్యక్తినే సీఎల్పీ సభ్యులు సీఎంగా ఎంచుకున్నారు. కాబట్టి కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ హైకమాండ్‌దే తుది నిర్ణయం కానుంది. 

    అదిష్టానానికి పెద్ద సవాలే!

    ఎన్నికల ప్రచారం సందర్భంలో హైకమాండ్ ఎవరినీ సీఎం చేసినా తమకు అభ్యంతరం లేదని డీకే. శివకుమార్‌, సిద్ధరామయ్యలు వ్యాఖ్యానించారు. కానీ ఎవరికీ వారు మనసులో సీఎం సీటుపై ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అదిష్టానం ఒకరికీ సీఎం సీటు అప్పగిస్తే, మరొకరు నొచ్చుకోనే పరిస్థితి ఉంది. ఇది అదిష్టానికి పెద్ద సవాలేనని చెప్పొచ్చు. కాబట్టి సీఎం కాలేని నేతకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఉన్న పదవిని అదిష్టానం కట్టబట్టే ఛాన్స్ ఉంది. సిద్ధరామయ్యను సీఎంగా అనుకుంటే.. డీకే శివకుమార్‌ను ఉపమంత్రి లేదా హోంమంత్రిని చేసే అవకాశముంది. ఇకపోతే సిద్ధరామయ్యకు ఇదే ఆఖరి ఎన్నికలు కావడంతో డీకే పార్టీలో కీలకం కానున్నాడు. భవిష్యత్‌లో కర్ణాటక కాంగ్రెస్ సీఎంగా డీకే శివకుమార్‌ను చూడవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version