ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెహమాన్ భార్య సైరా బాను (Saira Bhanu) తరపు లాయర్ ప్రకటించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే ఆ విడాకుల అనౌన్స్‌మెంట్ వచ్చిన కొద్దిసేపటికే అతడి టీమ్‌లోని మోహిని దే (Mohini Dey) అనే మహిళ తన భర్తకు విడాకులు ప్రకటించడం చర్చనీయాంశమైంది. రెహమాన్ ఆమెతో రిలేషన్‌లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు ఒక్కటయ్యేందుకే జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే వీటిపై తాజాగా మోహిని దే స్పందించింది. రెహమాన్‌తో తనకున్న రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది.
‘నిందలు వేయడం కరెక్ట్ కాదు’
ఏ.ఆర్. రెహమాన్‌తో రిలేషన్‌పై వస్తోన్న నెగిటివ్ కామెంట్స్‌ను బేస్ ప్లేయర్ మోహిని దే తీవ్రంగా ఖండించింది. ఆయన తనకు తండ్రితో సమానమని స్పష్టం చేసింది. తనది ఏ.ఆర్. రెహమాన్ కుమార్తెలది ఒకటే వయసని గుర్తుచేసింది. ఆయన తనను ఎప్పుడూ కూతురు లాగానే చూశారని చెప్పింది. 8 ఏళ్ల నుంచి ఆయన బృందంలో పని చేస్తున్నానని రెహమాన్ అంటే తనకెంతో గౌరవమని పేర్కొంది. మాపై ఇలాంటి రూమర్స్ రావడం చాలా బాధకరమని చెప్పింది. సున్నితమైన విషయాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ ప్రచారానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది. ఈ ఏడాదే తన తండ్రిని కోల్పోయానని అప్పటి నుంచి రెహమాన్ టీమ్‌లోని ప్రతీ ఒక్కరూ తనను సొంత వ్యక్తిలా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చింది.
ఆడియో రిలీజ్ చేసిన మాజీ భార్య
ఏ.ఆర్. రెహమాన్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన భార్య సైరా బాను సైతం స్పందించింది. ఈ మేరకు ఆఢియోను విడుదల చేసింది. యూట్యూబర్లు, తమిళ మీడియా రెహమాన్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. రెహమాన్ ప్రపంచంలోనే చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చింది. ఇకనైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని హితవు పలికింది. మరోవైపు రెహమాన్ భార్య తరపు న్యాయవాది సైతం ఈ వ్యవహారంపై మాట్లాడారు. రెండు జంటల డివోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరస్పర అంగీకారంతోనే సైరా – రెహమాన్ విడిపోయారని స్పష్టం చేశారు. వైవాహిక బంధంలో సైరా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని చెప్పుకొచ్చారు. వారు విడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని చెప్పారు.
సైరా బాను గురించి తెలుసా!
రెహమాన్ మాజీ భార్య సైరా బాను (Saira Bhanu) గుజరాజ్‌లో జన్మించింది. ఆమె ప్రముఖ మలయాళ యాక్టర్ రషిన్ రెహమాన్ మరదలు. ఓ దర్గాలో తొలిసారి సైరాను చూసిన రెహమాన్ తల్లి ఆమెను ఇష్టపడింది. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లితో రెహమాన్ సైరా ఒక్కటయ్యారు. ఏ.ఆర్ రెహమాన్ నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. రెహమాన్ – సైరా జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు ఖతీజా వివాహాన్ని 2022లో ఘనంగా నిర్వహించారు.
ఫుల్ రైజింగ్‌లో రెహమాన్!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ (A.R. Rehman) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ ఏడాది వచ్చిన అయాలన్, లాల్ సలామ్ చిత్రాలకు రెహమానే సంగీతం సమకూర్చాడు. ముఖ్యంగా రాయన్‌లోని పాటలు ప్రేక్షకులను బాగా అలరించారు. రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌కు సైతం రెహమాన్ వర్క్ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నేరుగా ఓ తెలుగు ఫిల్మ్‌కు రెహమాన్ వర్క్ చేయబోతున్నారు. దీంతో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందోనని సంగీత ప్రియులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..