సాధారణంగా హీరోయిన్లకు తమ మెుదటి చిత్రంతో ఇండస్ట్రీలో పేరు వస్తుంది. కానీ, నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి మాత్రం తెలుగులో ఒక్క సినిమా చేయనప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ముగ్గురు స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకోవడమే ఇందుకు కారణం. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, విజయ్ దేవరకొండ ‘VD 12’, నాని – సుజీత్ కాంబోలో రానున్న చిత్రాలకు భాగ్యశ్రీ లాక్ అయ్యింది. దీంతో టాలీవుడ్‌కు మరో కొత్త స్టార్ హీరోయిన్ దొరికేసిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ భామకు గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ను ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భాగ్యశ్రీ బోర్సే ఎవరు?
బాలీవుడ్‌కు చెందిన యువ నటి.
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్ర ఔరంగబాద్‌లో భాగ్యశ్రీ జన్మించింది.
భాగ్యశ్రీ బోర్సే పుట్టిన తేది?
ఈ భామ తన పుట్టిన రోజును ఎక్కడ పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది?
మహారాష్ట్ర పుణేలో ఈ భామ నివసిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సే తల్లిదండ్రులు ఎవరు?
తన కుటుంబ సభ్యుల వివరాలను భాగ్యశ్రీ ఎక్కడా వెల్లడించలేదు. ఈ విషయంలో ఆమె గోప్యత పాటిస్తోంది.
భాగ్యశ్రీ బోర్సేకు తోబుట్టువులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఓ సోదరి ఉన్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టును బట్టి తెలిసింది.
భాగ్యశ్రీ బోర్సే ఎత్తు ఎంత?
178 సెం.మీ (5 అడుగుల 8 అంగుళాలు)
భాగ్యశ్రీ బోర్సే ఎక్కడ చదువుకుంది?
నైజీరియాలోని లాగోస్‌లో ఈ భామ చదువుకుంది.
భాగ్యశ్రీ బోర్సే విద్యార్హత ఏంటి?
ఈ భామ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.
భాగ్యశ్రీ బోర్సే ఏ మతానికి చెందిన నటి?
హిందూ
భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌ను ఎలా ప్రారంభించింది?
సినిమాల్లోకి రాకముందు ఈ భామ మోడల్‌గా చేసింది. ఒక మోడలింగ్ ఏజెన్సీతో కలిసి పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిచింది.
భాగ్యశ్రీ బోర్సేకు ఎలా పాపులర్ అయ్యింది?
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారానే ఆమెకు తొలి చిత్ర ఆఫర్ వచ్చింది.
భాగ్యశ్రీ బోర్సే తెరంగేట్ర సినిమా ఏది?
2023 అక్టోబర్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘యారియన్ 2’ ద్వారా ఈ భామ వెండితెరకు పరిచయమైంది.
భాగ్యశ్రీ బోర్సే పోషించిన తొలి సినిమా పాత్ర పేరు?
రాజ్యలక్ష్మీ
భాగ్యశ్రీ బోర్సే అప్‌కమింగ్ తెలుగు చిత్రాలు?
‘మిస్టర్ బచ్చన్’, ‘VD 12’, ‘Nani 32’
భాగ్యశ్రీ బోర్సే ఫేవరేట్ ఫుడ్?
తన ఆహార అభిరుచుల గురించి ఈ భామ ఎక్కడా పంచుకోలేదు.
భాగ్యశ్రీ బోర్సేకు ఇష్టమైన నటీనటులు?
ఫేవరేట్ యాక్టర్స్ గురించి భాగ్యశ్రీ ఏ ఇంటర్యూలోనూ రివీల్ చేయలేదు.
భాగ్యశ్రీ బోర్సే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్ ఏది?
https://www.instagram.com/bhagyashriiborse/?hl=en