Big News: ‘పుష్ప 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన నిర్మాత 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Big News: ‘పుష్ప 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన నిర్మాత 

    Big News: ‘పుష్ప 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన నిర్మాత 

    October 24, 2024

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అంతకంటే ముందే సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ‘పుష్ప 3’(Pushpa 3) కూడా కచ్చితంగా ఉంటుందంటూ అధికారిక ప్రకటన చేశారు. 

    ఒక రోజు ముందే..

    అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం అనుకున్న తేదీ (డిసెంబరు 6) కంటే ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. 

    ‘పుష్ప 3’ పక్కా

    ‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్‌ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్ సైతం మూడో పార్ట్‌ గురించి హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్‌ 3 కి సంబంధించి సాలిడ్‌ లీడ్‌ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా ‘పుష్ప 3’ ఉంటుందని పునరుద్ఘటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్‌ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్‌ చేయలేదు. 

    జాతర ఎపిసోడ్‌పై హైప్‌

    ‘పుష్ప 2’లోని జాతర ఎపిసోడ్‌పై నిర్మాతలు స్పందించారు. ఆ ఎపిసోడ్‌ చిత్రీకరించేందుకు దాదాపు 35 రోజుల సమయం పట్టిందని తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్‌ కూడా చేసినట్లు తెలిపారు. ఈ ఎపిసోడ్‌ విషయంలోనే కాకుండా ప్రతి సన్నివేశం(Pushpa 3)  కోసం దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ చాలా కష్టపడినట్లు చెప్పారు. అందరూ ఊహిస్తున్నట్టే జాతర ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో హైప్‌కు తగ్గట్లు ఆ సీన్‌కు భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు. దీన్ని బట్టి జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. 

    నాన్‌ థియేట్రికల్‌ రికార్డు

    పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు.

    రూ.1000 కోట్ల బిజినెస్‌!

    ‘పుష్ప 2’ చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్‌ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్‌ హక్కులు విక్రయించినట్లు(Pushpa 3)  తెలిపాయి. నార్త్‌ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్‌ రూ.120 కోట్ల మేర బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్‌ రైట్స్‌ రూ.65 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version