• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.. వైద్య నిపుణుల సూచన మేరకు ఏఐజీ ఆస్పత్రిలో అవసరమైన పరీక్షలు చేయించుకోనున్నారు. శనివారం ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

    ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.

    తిరుమలలో భారీ వర్షం

    తిరుమలలో భారీ వర్షం కురిసింది.దీంతో దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కాస్తా పెరిగింది.

    సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

    వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘తన పార్టీతో సంబంధం లేదని గతంలో రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనపై ఆయన మాట్లాడుతున్నారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నాము. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెప్పాలి’. అని షర్మిల వ్యాఖ్యానించారు.

    కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య

    సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆయన దేవరకద్రకు వెళ్తుండగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. దీంతో కేసీఆర్ దేవరకద్రకు వెళ్లేందుకు ఏవియేషన్‌ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయనుంది.

    అందుకే కేసీఆర్‌‌పై పోటీ: ఈటల

    బీఆర్‌ఎస్ నేతలకే ‘బీసీ బంధు’ దక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. ‘కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, సంతోషంగా లేరు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అంటున్నారు. అయితే తానుందుకు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తాను. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం బీజేపీకే సాధ్యం. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలి’. అని ఈటల పేర్కొన్నారు.

    ఆ ఇద్దరే తెలంగాణ ద్రోహులు: షర్మిల

    సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్‌టీపీఅధ్యక్షురాలు షర్మిల ఫైరయ్యారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లకు మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని విమర్శించారు. ప్రజలు నమ్మి రెండు సార్లు అధికారమిస్తే రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని షర్మిల విమర్శించారు.

    నామినేషన్‌ పత్రాలతో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

    సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్‌ తాను దాఖలు చేయనున్న నామినేషన్‌ పత్రాలకు పూజలు చేశారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

    BRS గెలవకపోతే అభివృద్ది ఆగిపోతుంది: KTR

    కేసీఆర్‌ మళ్లీ సీఎం కాకపోతే రాష్ట్ర అభివృద్ది ఆగిపోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన హైదరాబాద్‌లో అభివృద్ధి అందరికీ కనిపిస్తోందన్నారు. కానీ విపక్షాలకు అది కనిపించట్లేదని విమర్శించారు. కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని తెలిపారు. ఈ పోరాటం దిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.

    శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి నేరుగా భక్తుల్ని అనుమతిస్తున్నారు. దీంతో ఎనిమిది గంటల్లో సర్వదర్శం చేసుకోవచ్చు. నిన్న 66,048 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లుగా తేలింది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబర్‌ 10న ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.