• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు 18 ట్వీట్లు చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అయితే.. సూర్యుడికి ప్రతిరోజూ దీపావళే కదా?’ అంటూ ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ‘ఈ దీపావళి సందర్భంగా దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. ఒకవేళ మీరు జబ్బుపడినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం జరిగేలా చూడాలని కోరుతున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. Tweets by RGVzoomin

    కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు

    సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన కుమార్తె సితారను మెచ్చుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. తాజాగా దీపావళి సందర్బంగా తాను నాట్యం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘నా నమ్మకాన్ని నిలబెట్టడంలో, గర్వపడేలా చేయడంలో నువ్వెప్పుడూ ఫెయిల్ కాలేదు’ అంటూ మహేశ్ పోస్టు చేశాడు. తన గురువు మహతీ భిక్షుతో కలిసి చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో చూడటానికి Watch On గుర్తుపై క్లిక్ … Read more

    సైనికులతో ఉత్సాహంగా రౌడీబాయ్

    దీపావళి సందర్భగా ఓ ఛానల్ నిర్వహిస్తున్న ‘జై జవాన్’ కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు ఆడుతూ ఉత్సాహ పరిచాడు. సైనికులతో కలిసి టగ్ ఆఫ్ వార్ ఆడాడు. వాలీబాల్ గేమ్‌లో పాల్గొని అలరించాడు. కాసేపు షూటింగ్ చేశాడు. అంతేకాకుండా ఓ రాత్రి మొత్తం సైనికులతో కలిసి పెట్రోలింగ్ చేయనున్నాడు. లైగర్ పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ ఇలా ఉత్సాహంగా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. #NDTVExclusive … Read more

    చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్

    జపనీస్ అభిమానులకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. చరణ్ ఆటోగ్రాఫ్ కోసం జపాన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారందరికీ ఎంతో ఓపికతో, వారు తెచ్చుకున్న పుస్తకాలపై సంతకాలు చేశాడు. రామ్‌చరణ్ తమకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడని జపనీస్ మురిసిపోయారు. కాగా రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 21న జపాన్‌లో విడుదలైంది. చిత్ర ప్రమోషన్లకు సంబంధించి రామ్‌చరణ్ జపాన్ వెళ్లారు. https://youtube.com/watch?v=GhqRRaHxlR8

    జవాన్లతో ‘రౌడీ’ విజయ్‌ దీపావళి సంబరాలు

    టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ భారత సైనికులతో సరదాగా గడిపారు. సైనిక జాకెట్ ధరించి, గన్ చేతబట్టి పాయింట్ రేంజ్‌లో కాల్పులు జరపడంపై జవాన్లను అడిగి తెలుసుకున్నాడు. సైనికులతో కలసి వాలీబాల్ ఆడి వారిలో ఉత్తేజం నింపాడు. ‘వాట్ లగాదేంగే’ అంటూ తన సినిమా డైలాగులు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఈ నెల 24, 25న దీపావళి సందర్భంగా ఎన్‌డీటీవీలో ప్రసారం కానుంది. కాగా విజయ్ నటించిన ‘లైగర్’ ఇటీవల విడుదలై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. #JaiJawan on NDTV … Read more

    ఎయిర్‌పోర్ట్‌లో భార్గవ్‌రామ్ సందడి

    టాలీవుడ్ స్టార్ నటుడు జూ.ఎన్టీఆర్, ఆయన కుమారుడు భార్గవ్‌రామ్‌ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు. తన కుమారుడు భార్గవ్‌రామ్‌ చేయి పట్టుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ నెల 21న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి జూ.ఎన్టీఆర్ కుటుంబంతో సహా హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. మరోవైపు రాజమౌళి కుటుంబం, రాంచరణ్ దంపతులు కూడా జపాన్ వెళ్లారు. View this post on Instagram A post shared by … Read more

    ‘సరోగసీ పుకార్లకు చెక్’

    సరోగసీ ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు సింగర్ చిన్మయి శ్రీపాద చెక్ పెట్టారు. బేబీ బంప్‌తో ఒక సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కవల పిల్లలకు పాలు ఇస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసుకుంది. దీంతో పాటు తన అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ సరోగసీ అంటూ కారుకూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోండి’’ అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.   Screengrab Instagram: CHINMAYI    Screengrab … Read more

    నాకు రష్మిక మంధాన అంటే క్రష్: బాలయ్య

    నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, హీరో విశ్వక్ సేన్‌తో బాలయ్య సందడి చేశారు. వారితో డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ సందర్భంగా వారికి పలురకాల ప్రశ్నలు సంధించారు. విశ్వక్ సేన్ అడిగిన ప్రశ్నకు తనకు రష్మిక మంధాన అంటే క్రష్ అని బాలకృష్ణ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

    అదే ఇండియన్ సినిమా ప్రత్యేకత: అల్లు అర్జున్

    సౌత్, నార్త్ అనే తేడాలున్నప్పటికీ.. వైవిధ్యతే మన భారతీయత ప్రత్యేకత అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. సీఎన్ఎన్ న్యూస్ 18 అందించే ‘ది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డును స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడారు. ‘పుష్ప విడుదలయ్యాక భారతీయ సినిమా విజయం సాధించిందని దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఇదే మనకుండే భావన. మనమంతా భారతీయ కళామతల్లి బిడ్డలం. ఈ క్లిష్ట సమయాల్లో వినోదాన్ని అందిస్తూ దేశానికి సేవ చేయడం మన అదృష్టం. ఇండియన్ సినిమా, ఇండియా.. ఎప్పుడూ … Read more

    గరికపాటిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్

    ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ట్వీట్‌లో గరికపాటికి చెందిన ఓ పాత [వీడియో](url)ను వర్మ పోస్ట్‌ చేశాడు. అందులో గరికపాటి టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క గురించి మాట్లాడారు. ‘ఆమెను చూసి తానే ఆకర్షితుడిని అయ్యానని, తన కొడుకు అవడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అని గరికపాటి అన్నారు. ఆ వీడియోను ఆర్జీవీ షేర్‌ చేస్తూ.. “ఓహో.. ఆహా.. అడ్డెడ్డే” అంటూ వ్యంగ్యంగా ఆర్జీవీ క్యాప్షన్‌ పెట్టాడు. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! ? … Read more