• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    Tamannaah Bhatia: బిగుతైన జాకెట్‌తో రెచ్చగొట్టిన తమన్నా!
    See More

    ఫ్యాన్స్‌ను చూసి ప‌రుగులు తీసిన షారుఖ్ ఖాన్‌

    హీరోల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం చాలా ముఖ్యం. కానీ ఒక్కోసారి పిచ్చి అభిమానం కూడా హీరోల‌ను ఇబ్బంది పెడుతుంటుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. లండ‌న్‌లో ఒక‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న షారూఖ్‌ను గుర్తుప‌ట్టిన కొంద‌రు ఫ్యాన్స్ ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చారు. అది చూసిన షారుఖ్ వారి నుంచి తప్పించుకోవ‌డానికి త‌న కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తాడు. ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో పెట్టిన కొంద‌రు షారుక్ పారిపోతున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

    దుల్కర్ సల్మన్ సీతారామం ట్రైలర్‌ విడుదల

    దుల్కర్ సల్మన్ యాక్ట్ చేసిన సీతారామం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లో దుల్కర్ డైలాగ్స్, యాక్టింగ్ అదరగొట్టాడు. మరోవైపు లోకేషన్స్ కూడా అదిరేలా ఉన్నాయి. రొమాంటిక్ డ్రామా, యుద్ధం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

    హాట్ ఫోటోషూట్‌తో రెచ్చిపోయిన సౌందర్య శర్మ

    నటి సౌందర్య శర్మ హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయింది. గోల్డ్ కలర్‌ బిగుతైన దుస్తులు ధరించి.. ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోషూట్‌లో పాల్గొన్న వీడియోను ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. ?⚡️? pic.twitter.com/9cFyBdpN1j — Soundarya Sharma (@soundarya_20) July 25, 2022

    అమీర్‌ఖాన్ భార‌తీయ సినిమా ఖ‌జానా: చిరంజీవి

    ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి మాట్లాడుతూ అమీర్‌ఖాన్ భార‌తీయ సినిమాకు ఖ‌జానా. ఎన్నో ప్ర‌యోగాలు, వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసి ప్ర‌జ‌ల ప్రేమ‌ను పొందాడు. అమీర్ న‌ట‌న‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాకు నేను తొంర‌ప‌డి స‌మ‌ర్ప‌కుడిగా మార‌లేదు. దీనిపై బాధ్య‌త‌తో, గ‌ర్వంతో ఇక్క‌డ విడుద‌ల చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

    అరుదైన అవార్డు స్వీకరించిన హీరో రజినీకాంత్

    సూపర్ స్టార్ రజినీకాంత్ మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు. తమిళనాడులో అత్యధిక పన్ను, వేగంగా చెల్లించే వ్యక్తిగా రజినీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో అక్కడి ఆదాయపు పన్ను శాఖ ఆయనను సన్మానించింది. రజినీకాంత్ ఓ మూవీ షూటింగ్ కారణంగా అందుబాటులో లేకపోవడంతో తన కుమార్తె ఐశ్వర్య అవార్డు అందుకున్నారు. జూలై 24న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.   View this post on Instagram A post shared … Read more

    ఆచార్య ఫలితంపై తొలిసారి స్పందించిన చిరంజీవి

    ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ చిత్ర‌బృందం నిన్న హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్‌ అమీర్‌ఖాన్‌ను ప్ర‌శంసించాడు. అమీర్ ఎప్పుడూ కొత్త ప్ర‌యోగాలు చేసి ప్ర‌జ‌ల‌ను మెప్పిస్తాడు. కానీ నేను ప్ర‌జ‌లు ఆమోదించే సినిమాల‌ను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాను. వీటికి మినిమం గ్యారంటీ ఉంటుంది. కానీ అప్పుడ‌ప్పుడు మ‌న ప్ర‌మేయం లేకుండా కొన్ని జ‌రిగిపోతాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడ‌వ‌ద్దంటూ ఆచార్య గురించి ప‌రోక్షంగా న‌వ్వుతూ చెప్పాడు చిరంజీవి.

    బెడ్ పై స్మైల్ ఇస్తు హీరోయిన్ రష్మిక పోస్ట్

    రష్మిక మందన్న తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. నల్లటి టీ షర్ట్ ధరించి స్మైల్ ఇస్తూ బెడ్ పై పడుకుంటున్న చిత్రాన్ని పంచుకుంది. అంతేకాదు పొటోతోపాటు ఫన్నీగా ఓ సింబల్ యాడ్ చేసి అప్పడప్పుడు ఇలా చేస్తానని రాసుకొచ్చింది. ఇక తర్వాత ఫొటోలో మరుసటి నిమిషం ఇది జరగబోతుందని వెల్లడించింది. ఆ పోస్ట్ పిక్స్ చూడాలంటే Watch on Instagram గుర్తుపై క్లిక్ చేసి చూసేయండి మరి.   View this post on Instagram A post shared by … Read more

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఫిక్స్

    రామారావు ఆన్ డ్యూటీ టిక్కెట్ల రేట్లు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ శరత్ మండవ ఈ మేరకు వెల్లడించారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో టెక్కెట్ ధర రూ.195, సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, రూ.100, రూ.50గా నిర్ణయించారు. ఏపీలో రూ.177, రూ.147, రూ.80గా ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.30 ఎక్కువ తీసుకుంటారని పేర్కొన్నారు. కొంచెం కష్టమైనా థియేటర్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకోవాలని సూచించారు. ఇక ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.

    స్టేజీపై పానీపూరి తినిపించుకున్న చిరంజీవి-అమీర్‌ఖాన్

    నేడు లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న పానీపూరీ డైలాగ్‌ను తెలుగులో అమీర్‌ఖాన్‌తో నాగ‌చైత‌న్య చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక డైలాగ్ చెప్పిన త‌ర్వాత పానీపూరీని చిరంజీవి, అమీర్‌ఖాన్ ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

    అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. నాగ‌చైత‌న్య ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గ న‌టిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా లాల్‌సింగ్ చ‌డ్డా తెర‌కెక్కింది. అద్వైత్ చంద‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ఆగ‌స్ట్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.