• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్..మరో జాతిరత్నాలు భయ్యా!

    ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కథ అందించి.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన వంశీధర్ గౌడ్-లక్ష్మీ నారాయణ.పి తెరకెక్కించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. పక్కా కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. జాతి రత్నాలు మాదిరిగానే మాస్ కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సినిమా టికెట్స్ చుట్టూ తిరుగుతున్న ఈ సినిమా మరో ‘జాతి రత్నాలు’ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.

    HBD మెలోడీ బ్రహ్మ మణిశర్మ

    పసందైన బాణీలతో అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఉంటారు మణిశర్మ. ఒకప్పుడు తన మ్యూజిక్ వచ్చిందంటే చాలు అన్ని చార్ట్ బస్టర్లు కావాల్సిందే. 1964 జులై 11న బందరులో ఆయన జన్మించారు. కెరీర్ ఆరంభంలో సహాయ సంగీత దర్శకునిగా పనిచేసిన మణి ఆ తరువాత స్వయంగా తనకు తానే బాణీలు కట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. రామానాయుడు ‘సోలో హీరోస్’ సినిమా నుంచి చిరంజీవి ‘ఆచార్య’ సినిమా వరకు ఎన్నో మధురమైన పాటలను మనకిచ్చిన మణిశర్మ పుట్టినరోజు నేడు. … Read more

    నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్ రిలీజ్

    హీరో కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో హీరో డైలాగ్స్, బాబా బాస్కర్ కామెడీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లుగా సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్‌ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిచగా, కిరణ్ అబ్బవరం స్వయంగా చెప్పిన డైలాగ్స్ సరదాగా అనిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గాధే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    HBD: విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కోట శ్రీనివాస‌రావు

    టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయాలంటే గుర్తొచ్చే పేరు కోట శ్రీనివాస‌రావు. నాలుగు ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీలో దీర్ఘ‌కాల ప్ర‌స్థానంతో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కోట శ్రీనివాస‌రావు జులై 10, 1943న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించాడు. తెలుగుతో పాటు అన్ని ద‌క్షిణాది భాష‌ల్లోనూ న‌టించాడు. 1999 నుంచి 2004 వ‌ర‌కు విజ‌య‌వాడ‌ ఎమ్మెల్యేగా కూడా ప‌నిచేశాడు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో న‌టించాడు. విల‌న్‌గా, తండ్రిగా, కామెడీ పాత్ర‌ల్లోనూ ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల‌తో … Read more

    ‘విక్ర‌మ్’ మేకింగ్ వీడియో అదుర్స్‌

    క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్ న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ సాధించింది. ఈ మూఈ జులై 3న హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌లో దూసుకెళ్తుంది. అయితే తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ ఒక్కో స‌న్నివేశం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో చూడ‌వ‌చ్చు. డ్ర‌గ్స్ మాఫియా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. సూర్య క్లైమాక్స్‌లో క‌నిపించి వైల్డ్ లుక్‌లో అద‌ర‌గొట్టాడు.

    ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ ట్రైల‌ర్ రిలీజ్

    ఐదుక‌థ‌ల స‌మ్మేళ‌నంగా తెర‌కెక్కించిన ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ మూవీ ట్రైల‌ర్‌ను నేడు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి రిలీజ్ చేశాడు. నోయ‌ల్, నందినీ రాయ్‌, బిగ్‌బాస్ అజ‌య్, సాయి రోన‌క్ వంటి వాళ్లు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గంగ‌న‌మోని శేఖ‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ్రాన్ మ్యూజిక్ అందించాడు. డి.మ‌ధు సినిమాను నిర్మిస్తున్నాడు.

    తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

    సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.

    బిత్తిరిస‌త్తితో ‘ది వారియ‌ర్’ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

    రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రామ్‌, కృతిశెట్టితో బిత్తిరి స‌త్తి ఇంట‌ర్వ్యూను తాజాగా రిలీజ్ చేశారు. స‌త్తి త‌న స్టైల్‌లో ప్ర‌శ్న‌ల‌డుగుతూ ఇద్ద‌రినీ న‌వ్వించాడు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ది వారియ‌ర్‌లో ఆది పినిశెట్టి విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే వ‌చ్చిన బుల్లెట్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

    వైర‌ల్ అవుతున్న చిట్టి బెల్లి డ్యాన్స్

    ‘జాతిర‌త్నాలు’ ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా చేసిన బెల్లీ డ్యాన్స్ తాజాగా సోష‌ల్‌మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. ఆమె ఎన‌ర్జిటిక్‌ డ్యాన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. జాతిర‌త్నాలు త‌ర్వాత ఈ అమ్మ‌డు వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌లో అతిథి పాత్ర‌ల్లో మెరిసింది. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రావ‌ణాసుర‌ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. వ‌ల్లిమ‌యిల్ అనే తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంలో న‌టిస్తుంది.

    రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ టీజర్

    మణిరత్నం కలల ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. వివిధ భాషల్లో వివిధ స్టార్ నటులు ఈ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు, కన్నడలో రక్షిత్ శెట్టి, మళయాలంలో మోహన్ లాల్, హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తమిళంలో సూర్య వంటి స్టార్స్ రిలీజ్ చేశారు.