Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!

    Chandini Chowdary: నోరు జారిన చాందిని చౌదరి.. ఏకిపారేస్తున్న సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌!

    May 1, 2024

    ప్రముఖ నటి చాందిని చౌదరి (Chandini Chowdary) అంటే ఈ జనరేషన్‌ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ‘కలర్‌ ఫొటో’ (Colour Photo) చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చిన చాందిని.. రీసెంట్‌గా ‘గామి’ (Gaami) చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఫ్యాన్స్‌ చాందినిపై తీవ్రంగా మండిపడుతున్నారు. 

    ఏం జరిగిదంటే?

    చాందిని చౌదరి లేటెస్ట్‌ చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy) విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్‌.. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తోంది కదా.. మీ ఫేవరేట్‌ టీమ్ ఏది? అని ప్రశ్నించారు. దీనికి చాందిని సమాధానం ఇస్తూ.. ‘నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు. సీసీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే చూశా. ఐపీఎల్‌ చూసిన తర్వాత ఏది ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను’ అని పేర్కొంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (SRH) టీమ్‌ ఉంది కదా అని రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘మాది ఆంధ్రా. మాకు ఆంధ్రా టీమ్‌ లేదు’ అని సరదాగా సమాధానం ఇచ్చింది. 

    సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ ఫైర్‌!

    చాందిని చౌదరి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఆమెపై ఒక్కసారిగా ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఫ్యాన్స్ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తెలంగాణ క్యాపిటల్‌ హైదరాబాద్‌ను ఓన్‌ చేసుకోలేకపోతోందంటూ మండిపడుతున్నారు. నీ చిత్రాలు కేవలం ఆంధ్రవాళ్లు మాత్రమే చూస్తున్నారా? తెలంగాణ వాళ్లు చూడటం లేదా? అని నిలదీస్తున్నారు. ఇలా సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటే పెద్ద హీరోయిన్‌వి ఎలా అవుతావంటూ ప్రశ్నిస్తున్నారు. 

    వివరణ ఇచ్చిన చాందిని 

    నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటుండటంతో నటి చాందిని తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు సైతం పెట్టింది. ‘నా ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏది అని అడిగితే.. నేను మ్యాచ్‌లు చూశాకే చెబుతా అన్నాను. నాది ఆంధ్రా కాబట్టి ఆంధ్రాకి కూడా టీం ఉంటే బాగుండు అన్నాను. ట్రేండింగ్ కంటెంట్‌కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేయడం మాములే కదా. అయినా.. నేను నా రెండు రాష్ట్రాలను చూసి గర్విస్తా. ఎందుకంటే నేను ఈ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని. హైదరాబాద్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అంటూ చాందిని రాసుకొచ్చింది. 

    రిలీజ్ ఎప్పుడంటే?

    చాంది చౌదరి లేటెస్ట్‌ చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy Release Date).. మే 31న విడుదల కానుంది. ఇందులో అజయ్‌ ఘోష్‌ లీడ్‌ రోల్‌లో నటించాడు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్లై హై బ్యానర్‌పై హర్ష గారపాటి నిర్మిస్తున్నారు. పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగమ్ కెమెరా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version