Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!

    Deep Fake: షోలే మూవీలో హాలీవుడ్‌ నటులు.. బార్బీ గార్ల్‌గా కంగనా. డీప్‌ ఫేక్‌ మాయలు మీరే చూడండి..!

    ప్రస్తుత కాలంలో సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘డీప్‌ ఫేక్‌ సాంకేతికత’ (Deep Fake Technology)కు కృత్రిమ మేధ (AI) మూల కారణమని చెప్పొచ్చు. ఈ సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు సినిమా రూపురేఖలనే మార్చేస్తున్నారు. పలు సూపర్‌ హిట్ సినిమాలకు సంబంధించిన సీన్లను తమకు నచ్చిన హీరో ముఖాలతో మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు డీప్‌ ఫేక్‌ (Deep Fake) అంటే ఏమిటీ? అది ఎలా పనిచేస్తుంది? దీనికి సంబంధించిన వైరల్‌ వీడియోలు ఏవి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    ఎలా పనిచేస్తుంది?

    ‘డీప్‌ ఫేసింగ్‌’ గురించి సాధారణ భాషలో చెప్పాలంటే మార్ఫింగ్‌ అని అర్ధం. డీప్‌ ఫేకింగ్‌ కోసం ఎన్‌కోడర్స్‌, డీకోడర్స్‌ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఎన్‌కోడర్స్‌ రెండు చిత్రాల కదలికలను క్షుణ్నంగా పరిశీలించి, వాటి మధ్య సారూప్యతను పసిగడుతుంది. ఇక డీకోడర్స్‌ ముఖాలను మార్చేస్తుంది. అయితే ఎంత బాగా మార్ఫింగ్‌ చేసినా కొంత లోటు ఉంటుంది. చూసే కళ్లకు అది డీప్‌ ఫేకింగ్‌ ఏమో అన్న అనుమానం కచ్చితంగా కలుగుతుంది. అయితే కొందరు మాత్రం మరింత అడ్వాన్స్‌డ్‌ సాంకేతికతను సంధించి డీప్‌ ఫేక్‌ వీడియోను మరింత సహజంగా మార్చేస్తున్నారు.

    షోలే.. డీప్‌ ఫేక్‌

    బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘షోలే’ చిత్రాన్ని కూడా ఇటీవల డీప్‌ ఫేక్‌ చేశారు. అందులోని పాత్రలను హాలీవుడ్‌ యాక్టర్ల ముఖాలతో మార్ఫింగ్‌ చేశారు. హాలీవుడ్‌ వర్షన్‌ షోలే మూవీ ఈ స్టైల్‌లో ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ డీప్‌ ఫేక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. సినిమాలోని జై (అమితాబ్‌ బచ్చన్‌) పాత్రలో అలనాటి హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డి నిరో (Robert De Niro) ఫేస్‌ను మార్ఫింగ్‌ చేశారు. ధర్మేంద్ర పాత్రలో అల్‌ పాసినో (Al Pacino), బాసంతి క్యారెక్టర్‌ను జులియా రాబర్ట్స్‌ , గబ్బర్‌ సింగ్‌ పాత్రను జాక్‌ నికోల్సన్‌ (Jack Nicholson), థాకూర్‌ బల్దేవ్‌ సింగ్‌ పాత్రలో కెవిన్‌ స్పేసీ (Kevin Spacey) ముఖాలను మార్ఫింగ్‌ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్‌ అవుతున్నారు. పాత్రలు చాలా బాగా సింక్‌ అయ్యాయని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ప్రయత్నం అసలు బాగోలేదని బదులిస్తున్నారు. 

    కంగనా, హృతిక్‌ 

    హాలీవుడ్‌లో రిలీజైన బార్బీ (Barbie) ఇటీవల ఓ వ్యక్తి డీప్‌ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్‌ చేశాడు. బార్బీ చిత్ర ట్రైలర్‌ను బాలీవుడ్‌ నటులు కంగనా రనౌత్, హృతిక్‌ రోషన్‌లతో డీప్‌ ఫేక్‌ చేయడం విశేషం. ఇందులో బార్బీ గార్ల్‌గా కంగనా కనిపించింది. ర్యాన్‌ గోస్లింగ్‌ (Ryan Gosling) పాత్రలో హృతిక్‌ సైతం అద్బుతంగా సెట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంగనా నిజంగానే బార్బీ గార్ల్‌ లా ఉందని పోస్టులు పెడుతున్నారు. 

    స్క్విడ్‌ గేమ్‌ 

    ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, తమన్నా బాయ్ ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో ఓ వ్యక్తి స్వ్కిడ్‌ గేమ్‌ సిరీస్‌ను డీప్‌ ఫేక్‌ చేశాడు. అందులోని వివిధ పాత్రలకు బాలీవుడ్‌ స్టార్‌ క్యాస్ట్‌ నసీరుద్దీన్‌ షా, తాప్సీ పన్ను, ఆలియా భట్‌, కంగనా రనౌత్, ఇషాన్‌ ఖట్టర్‌, నితిన్‌ ముఖేశ్‌ ముఖాలను మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కూడా నెట్టింట తెగ పాపులర్ అయ్యింది. 

    టెర్మినేటర్‌ 

    హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ టెర్మినేటర్‌ను సైతం డీప్‌ ఫేక్‌ చేశారు. ఇందులా ఆర్నాల్డ్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version