యంగ్ బ్యూటీ ఎస్తర్ అనిల్ (Esther Anil) మరోమారు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.
తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్.. హాట్ అందాలను ఆరబోసింది. యద అందాలు చూపిస్తూ కుర్రకారు హృదయాలను దోచుకుంది.
ఎస్తర్ తేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ తలదన్నే గ్లామర్ ఆమె సొంతం అంటూ పోస్టులు పెడుతున్నారు.
దృశ్యం (Drushyam) సినిమాలో వెంకటేష్ (Venkatesh) చిన్న కూతురిలా నటించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌లతో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.
బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఎస్తర్ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే తన అందాల తెగింపుతో నెటిజన్లలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
2001 ఆగస్టు 27న జన్మించిన ఎస్తర్, బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో నల్లావన్ (Nallavan) సినిమా ద్వారా చిత్ర సీమలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఓరు నాల్ వారుమ్ (Oru Naal Varum), కాక్‌టైల్ (Cocktail), డాక్టర్ లవ్ (Doctor Love), ది మెట్రో (The Metro) చిత్రాల్లో బాలనటిగా చేసింది.
వయోలిన్ (Violin), మల్లు సింగ్ (Mallu Singh) సినిమాల్లోనూ బాలనటిగా కనిపించి అందరి దృష్టిని ఎస్తర్ ఆకర్షించింది.
అయితే 2013లో మలయాళంలో వచ్చిన దృశ్యం సినిమాతో ఎస్తర్ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
అందులో మోహన్‌లాల్ (Mohanlal) చిన్నకూతురిలా నటించింది. ఈ సినిమానే తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేయగా తిరిగే అదే పాత్రను ఎస్తర్ పోషించింది.
‘దృశ్యం’ తర్వాత ఎస్తర్‌కు వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ‘దృశ్యం 2’ తెలుగు, మలయాళ వెర్షన్‌లోనూ ఎస్తర్ నటించింది.
గతేడాది జనవరిలో రిలీజైన ‘వింధ్య విక్టిమ్ వర్‌డిక్ట్’ సినిమాలోనూ ఎస్తర్ ముఖ్యపాత్ర పోషించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం తమిళంలో ‘మిణ్మినీ’ చిత్రంలో ఎస్తర్ నటిస్తోంది. దాదాపు ఏడాది కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఎస్తర్ ఆశలన్నీ ఈ సినిమాపై ఉన్నాయి.
ఇక ఎస్తర్ అవార్డుల విషయానికి వస్తే దృశ్యం సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌ను దక్కించుకుంది.
అలాగే ‘పాపనాశనం’ మూవీకి సంబంధించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం హీరోయిన్‌గా రాణించాలని చూస్తోన్న ఎస్తర్ సోషల్ మీడియాలో వరుసగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.
దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఫ్యాన్స్ తాకిడి పెరిగింది. ప్రస్తుతం ఆ ఖాతాను 1.4M మిలయన్ల మంది ఫాలో అవుతున్నారు.