Flipkart Big Billion Days Sale 2024:  గూగుల్ పిక్సెల్, గెలాక్సీ స్మార్ట్‌ ఫొన్లపై ఏకంగా రూ.30 వేలు డిస్కౌంట్.. ఎప్పటి నుంచి అంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Flipkart Big Billion Days Sale 2024:  గూగుల్ పిక్సెల్, గెలాక్సీ స్మార్ట్‌ ఫొన్లపై ఏకంగా రూ.30 వేలు డిస్కౌంట్.. ఎప్పటి నుంచి అంటే?

    Flipkart Big Billion Days Sale 2024:  గూగుల్ పిక్సెల్, గెలాక్సీ స్మార్ట్‌ ఫొన్లపై ఏకంగా రూ.30 వేలు డిస్కౌంట్.. ఎప్పటి నుంచి అంటే?

    September 19, 2024

    సెప్టెంబర్ 27 నుంచి బిగ్‌బిలియన్ డేస్ ప్రారంభం కానున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. Flipkart Plus సభ్యులకు సెప్టెంబర్ 26 న  24 గంటల ముందుగా సేల్‌కు ప్రీ-యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, లాప్టాప్స్, స్మార్ట్‌వాచ్లు, స్మార్ట్ TVలపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. Google Pixel 8,  Samsung Galaxy S23 వంటి పరికరాలు ఆకర్షణీయమైన ధరలలో అందుబాటులో ఉంటాయి.

    స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు:

    Flipkart వెబ్‌సైట్‌లో, కొన్ని స్మార్ట్‌ఫోన్లపై రాయితీ ధరలను టీజ్ చేస్తోంది. 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Google Pixel 8పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా దీని ధర Rs. 75,999 కాగా బిగ్‌ బిలియన్ డేస్‌లో Rs. 40,000 వద్ద లభించనున్నట్లు వెల్లడించింది. 

    అలాగే, 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Samsung Galaxy S23 సాధారణ ధర  Rs. 89,999 కాగా ప్రస్తుతం అది  Rs. 40,000 వద్ద లభించనుంది.

    ఇంకా, Samsung Galaxy S23 FE బేస్ మోడల్  ధర Rs. 79,999 కాగా అది Rs. 30,000కే లభించనున్నట్లు టీజర్ రన్‌ అవుతోంది. Poco X6 Pro 5G కూడా Rs. 20,000కే లభించనుంది. ఇది పూర్తిగా ఫెర్ఫామెన్స్‌పై ఫొకస్ చేయబడిన ఫొన్.

    ఇతర స్మార్ట్‌ఫోన్ల సేల్ ధరలు ఇంకా వెల్లడించబడలేదు, కానీ Flipkart CMF Phone 1, Nothing Phone 2a, Poco M6 Plus, Vivo T3X, Infinix Note 40 Pro మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని మాత్రం ధృవీకరించింది.

    బ్యాంకు ఆఫర్లు

    HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, Flipkart UPI తో లావాదేవీలు చేస్తే, వినియోగదారులు Rs. 50 వరకు తగ్గింపు పొందవచ్చు.

    Flipkart Pay Later చెల్లింపు ద్వారా Rs. ఒక లక్ష వరకు క్రెడిట్ పొందవచ్చని Flipkart పేర్కొంది. Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి, నో-కోస్ట్ EMI కూడా పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version