HMD Skyline 5G: మీడియం బడ్జెట్‌లో  ప్రీమియం ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్… రియల్‌మీ, శాంసంగ్‌కు దెబ్బ పడనుందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HMD Skyline 5G: మీడియం బడ్జెట్‌లో  ప్రీమియం ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్… రియల్‌మీ, శాంసంగ్‌కు దెబ్బ పడనుందా?

    HMD Skyline 5G: మీడియం బడ్జెట్‌లో  ప్రీమియం ఫీచర్లతో కొత్త ఫొన్ లాంచ్… రియల్‌మీ, శాంసంగ్‌కు దెబ్బ పడనుందా?

    September 17, 2024

    HMD గ్లోబల్ తన సరికొత్త HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ను త్వరలో భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు అధికారిక టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి ఈ ఏడాది జూలైలో ఆవిష్కరించబడింది. HMD బ్రాండ్ కింద వస్తున్న మొట్టమొదటి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని చెప్పొచ్చు. ఇది పాత నోకియా లూమియా ఫ్యాబులా డిజైన్ స్ఫూర్తితో రూపొందించబడినట్లు సమాచారం.

    అధికారిక టీజర్

    తాజాగా HMD తన అధికారిక X  ఖాతా ద్వారా స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ గురించి ప్రస్తావించింది. ఈ పోస్ట్‌లో “ఆకాశాన్ని తాకడం అంటే ఏమిటి” అన్న సందేశం స్కైలైన్ ఫోన్ విడుదలకు గల సంకేతాలను ఇస్తోంది.

    గ్లోబల్ వేరియంట్ ఫీచర్లు

    HMD స్కైలైన్ 2023 జూలైలో ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి:

    • డిస్ప్లే: 6.55-అంగుళాల P-OLED FHD+ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 రక్షణ, 1000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ ను అందిస్తుంది. IP54 రేటింగ్ కారణంగా పరికరం దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉంది
    • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్
    • రామ్ & స్టోరేజ్: 12GB వరకు రామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్
    • కెమెరా: 108MP ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 13MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా (ఆటో ఫోకస్‌)తో వస్తుంది. తద్వారా లైట్‌తో సంబంధం లేకుండా నాణ్యమైన ఫొటోలు తీయవచ్చు.
    • బ్యాటరీ: 4600mAh బ్యాటరీ, 33W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
    • సాఫ్ట్‌వేర్: Android 14 తో రాబోతోంది, రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్స్‌తో పాటు మూడు సంవత్సరాల పాటు భద్రతా పరమైన ఫీచర్లు లభిస్తాయి.

    స్మార్ట్‌ఫోన్ ఇతర ప్రత్యేకతలు

    HMD స్కైలైన్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి:

    • సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
    • డ్యూయల్ స్పీకర్లు
    • మైక్రో SD కార్డ్ స్లాట్ (స్టోరేజ్ విస్తరణకు)
    • IP54 రేటింగ్ (దుమ్ము మరియు నీటి నిరోధకత)

    అంచనా ధర

    HMD స్కైలైన్ గ్లోబల్ వేరియంట్ ధర $499 (దాదాపు రూ. 42,000) గా ఉంది. ఇండియన్‌ మార్కెట్‌లో  ఇది మీడియం బడ్జెట్‌ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడనుంది. HMD స్కైలైన్ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లు.. వినియోగదారులను ఇట్టే ఆకర్షించే అవకాశం ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో మోటరోలా, సామ్‌సంగ్, షావోమి వంటి బ్రాండ్లతో పోటీ పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version