James Movie Review Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • James Movie Review Telugu

    James Movie Review Telugu

    July 20, 2022

    జేమ్స్ మూవీ దివంగ‌త క‌న్న‌డ‌ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్‌ న‌టించిన చివ‌రి సినిమా. ఈ సినిమాకు కార్ణ‌ట‌క‌లో విడుద‌ల‌కు ముందే భారీగా ప్రేక్షాక‌ద‌ర‌ణ ల‌భించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తి చేసిన పునీత్ డ‌బ్బింగ్ చెప్ప‌క‌ముందే మ‌ర‌ణించాడు. దీంతో ఈ సినిమా కోసం పునీత్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ డ‌బ్బింగ్ చెప్పాడు. పునీత్ రాజ్‌కుమార్‌తో జేమ్స్ మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది. చేత‌న్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చ‌ర‌ణ్ రాజ్ సంగీతం అందించాడు. మ‌రి పునీత్ చివ‌రి సినిమా ఎలా ఉంది. స్టోరీ ఏంటి తెలుసుకుందాం

    బెంగుళూరు నగరంలో రెండు మాఫియా గ్రూపులు చెల‌రేగిపోతుంటాయి. అందులో ఒక గ్రూప్ లీడ‌ర్‌ విజ‌య్ గైక్వాడ్ (శ్రీకాంత్) త‌న‌కి ప్రాణ భ‌యం ఉండ‌టంతో సంతోష (పునీత్ రాజ్‌కుమార్)ని తన సెక్యూరిటీగా నియమించుకుంటాడు. అయితే అనూహ్యంగా సంతోష్.. విజ‌య్ గైక్వాడ్‌తో పాటు అత‌ని సోద‌రి ప్రియా ఆనంద్‌ను కూడా కిడ్నాప్ చేస్తాడు. అప్పుడే త‌న పేరు జేమ్స్ అని ప్ర‌క‌టిస్తాడు.  ఇంత‌కీ  ఈ జేమ్స్ ఎవరు? అతడికి మాఫియాకు సంబంధం ఏమిటి? విజయ్ గైక్వాడ్‌ను, అత‌డి  సోదరిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అస‌లు కథ ఏమిటి? సమాధానం తెలియాలంటే సినిమాని వెండి తెరపై చూడాల్సిందే.

    క‌థ మొద‌ట ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మ‌వుతుంది. పునీత్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన విధానం కూడా బాగుంది. కానీ ఆ త‌ర్వాత స్టోరీ నెమ్మ‌దిస్తుంది. తిరిగి ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి కాస్త పుంజుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.  స్టోరీ కొత్త‌దేమి కాదు. ఇదివ‌రకు చూసిన‌ట్లుగానే ఉంటుంది. కొన్ని సీన్లు త‌ప్ప‌ స్క్రీన్ ప్లే అంతా డల్‌గా ఉంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని కూడా సాగ‌దీసిన‌ట్లుగా అనిపిస్తుంది.  సినిమా నిడివి కోసం అవ‌స‌రం లేక‌పోయినా కొన్ని స‌న్నివేశాల‌ను జోడించిన‌ట్లు అనిపిస్తుంది. రొటీన్ క‌థ అయిన‌ప్ప‌టికీ పునీత్‌ను ఫ్యాన్స్‌కు న‌చ్చేలా చూపించ‌డంలో, మాస్ ఎలిమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేశాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌నంపై ఇంకాస్త క‌స‌ర‌త్తు చేసుంటే బాగుండేది. 

    పునీత్ రాజ్‌కుమార్ ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్‌కు త‌గిన‌ట్లుగా ఫిట్‌గా క‌నిపిస్తాడు. ఆర్మీ యూనిఫాంలో అత‌డి స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా చూస్తుంటే పునీత్ లేడ‌నే చేదు నిజాన్ని న‌మ్మ‌డం క‌ష్టం. శ్రీకాంత్‌కు మంచి బ‌ల‌మైన పాత్ర ల‌భించింది. దాన్ని అత‌డు చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నాడు. ప్రియా ఆనంద్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. శ‌ర‌త్ కుమార్‌తో పాటు ఇత‌ర తారాగ‌ణం వారి పాత్రాల మేర‌కు న‌టించారు. ఈ యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాను స్టైలిష్‌గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు చేత‌న్  కుమార్. సెకండాఫ్ డీసెంట్ గా, మంచి ఎమోషన్స్ తో సాగుతుంది. శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కొంత‌సేపు మెర‌వ‌డం అభిమానుల‌కు సంతోషం క‌లిగిస్తుంది.

    మొత్తానికి ఫ్యాన్స్‌ను మెప్పించే సినిమా జేమ్స్. అందుకే రేటింగ్ గురించి ఆలోచించ‌కుండా పునీత్‌ను చివ‌రిసారిగా వెండిత‌రెపై చూడాల్సిందిగా కోరుకుంటున్నాం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version