Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?

    Prabhas: ప్రభాస్‌పై భారీగా ట్రోల్స్‌.. ఇంతకు ఆ పోస్టర్‌లో ఏముందంటే?

    October 24, 2024

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం డార్లింగ్ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 23న స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. తాము ఎక్స్‌పెక్ట్‌ చేసిన స్థాయిలో పోస్టర్‌ లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

    ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉందంటే?

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు మారుతి (Director Maruti) తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab) చిత్రంలో మాళవికా మోహనన్‌ (Malavika Mohanan), నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal), రిద్ధి కుమార్‌ (Riddhi Kumar) హీరోయిన్లుగా చేస్తున్నారు. బుధవారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెషల్‌ వీడియోతో మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ప్రభాస్‌ సింహాసనం మీద నోటిలో సిగార్‌తో రాజు లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ లుక్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌కు గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

    అదేం పోస్టర్‌ అంటూ ట్రోల్స్‌!

    రాజాసాబ్‌ తాజా పోస్టర్ చూసి తాము తీవ్రంగా డిజప్పాయింట్‌ అయినట్లు కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్‌ నోట్లో సిగర్ పెట్టుకొని ఉన్న పోస్టర్‌ను ‘సై’ సినిమాలోని బిక్షు యాదవ్‌తో పోలుస్తున్నారు. బర్త్‌డే రోజున ఇలాంటి పోస్టర్‌ రిలీజ్‌ చేసి రాజాసాబ్‌ టీమే ప్రభాస్‌ను ట్రోల్‌ చేసిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నాగవల్లి’ సినిమాలో వెంకటేష్‌ లుక్‌కు కాంపిటీషన్ ఇచ్చేలా ప్రభాస్‌ పోస్టర్ ఉందని మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు. మోషన్‌ వీడియోలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చాలా పూర్‌గా ఉందని, సడెన్‌గా చూసి ఫ్యాన్ మేడ్‌ అనుకున్నానని ఓ వ్యక్తి పోస్టు పెట్టాడు. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్‌ను ఇలా ఒక్క పోస్టర్‌ గురించి ట్రోల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభాస్‌ను టార్గెట్‌ చేస్తున్న వారికి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్‌ సక్సెస్‌ను తట్టుకోలేకనే ఇలా ట్రోల్స్‌ చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. 

    పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జోరు

    ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. 

    250 రోజులపాటు ట్రెండింగ్‌

    మరోవైపు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చి అదరగొట్టింది. ప్రభాస్‌ పుట్టినరోజును పురస్కరించుకొని హాట్‌స్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది. 250 రోజుల పాటు వరుసగా ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచినట్లు పేర్కొంది. దీంతో ప్రభాస్‌ దూకుడు ఓటీటీలోనూ కొనసాగుతోందంటూ ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సలార్‌ను హై వోల్టేజ్‌ చిత్రంగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించారు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సినిమాను నింపేశారు. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version