తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

    తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

    April 3, 2023

    © ANI Photo

    దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.91.50 తగ్గించాయి. తాజా తగ్గింపుతో గ్యాస్ బండ ధర రూ.2,233కు పడిపోయింది. మరోవైపు గృహ అవసరాలకు వాడే 14కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 14కిలోల సిలిండర్ రేటు హైదరాబాద్‌లో రూ.1150గా ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ సంస్థలు రేట్లను సమీక్షిస్తుంటాయి.

    ప్రతీ ఆర్థిక సంవత్సరం తొలి రోజున చమురు సంస్థలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ రేటు ఆధారంగా ఈ సవరణలు జరుగుతాయి. కాగా, తాజాగా తగ్గిన ధరలతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 2,028, కోల్‌కత్తాలో రూ. 2,132, ముంబయిలో రూ. 1,980, చెన్నైలో రూ. 2192కు తగ్గింది.

    అటు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ ప్రకటించింది. ఈ పథకంలో ఉన్న 9.59 కోట్ల మంది లబ్దిదారులకు సిలిండర్‌పై రూ. 200 రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే గృహ వినియోగ సిలిండర్లను సంవత్సరానికి 12 మాత్రమే ఉపయోగించుకునేలా కేంద్రం పరిమితి విధించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version