• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాట్నా అభిమానులకు ‘బన్నీ’ స్పెషల్ థ్యాంక్స్

    నవంబర్ 18న పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ పాట్నా అంటూ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. https://x.com/alluarjun/status/1858464910726058248

    Winter Honeymoon places in Ap: చలికాలంలో కొత్త దంపతులకు అనువైన టాప్ 20 పర్యాటక ప్రదేశాలు

    కొత్త దంపతులకు చలికాలం అనేది ఆనందకరమైన జీవితం గడపడానికి అత్యుత్తమ కాలం. నవదంపతుల మధ్య అన్యొన్యత పెరగడానికి శీతకాలం అనువైనదిగా పెద్దలు చెబుతుంటారు.  ఈ కాలంలో పర్యాటనలు మరింత ఆనందంగా ఉంటాయి. ఈ క్రమంలో కొత్త దంపతులకు హనీమూన్‌ అనుభవాన్ని మరింత పెంచే ఆంధ్రప్రదేశ్‌లోని  ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను మీకోసం అందిస్తున్నాం. సముద్రతీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కోటలు, పచ్చని అడవుల అందాలు మీకు సరికొత్త అనుభవాన్ని పంచుతాయి. ఈ కథనం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో చలికాలంలో కొత్త దంపతులు సందర్శించదగిన 20 ప్రత్యేకమైన పర్యాటక … Read more

    Top 20 Famous Temples in Andhra Pradesh: ఈ ఆలయాలకు వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా మహత్తరమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆలయానికి స్వంతమైన కథ, ప్రత్యేకత, ఆధ్యాత్మిక చరిత్ర వుంది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 20 దేవాలయాల గురించి, వాటి విశిష్టత, పురాణ గాథలు, ప్రసాదాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఆనవాయితి, నమ్మకాల గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. 1. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థలం: తిరుమల, చిత్తూరు స్థల పురాణం: తిరుమలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవంగా … Read more

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!

    ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 24) పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్‌ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. దీనిపై పవన్‌ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. తాను అర్థం … Read more

    Tirumala Laddu : సినీ హీరోలకు పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. సారీ చెప్పిన తమిళ్ హీరో కార్తి!

    తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష మూడవ రోజులో భాగంగా ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో  శుద్ది కార్యక్రమం నిర్వహించారు. ఆలయం వద్ద మెట్లను పవన్ తానే స్వయంగా శుద్ధి  చేసి మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు. ఆపై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్‌.. నటుడు ప్రకాష్‌ రాజ్‌తో పాటు ఇండస్ట్రీలోని నటులపై కీలక వ్యాఖ్యలు … Read more

    పవన్‌ కళ్యాణ్‌ను గెలిపించండి: చిరంజీవి

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన సొంత డబ్బుతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచిన పవన్.. వీరమరణం పొంది జవాన్ల కుటుంబాలకు అండగా ఉన్నారన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీలేకుండా పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చట్ట సభల్లో అతని గొంతు వినాలన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. https://youtube.com/watch?v=WUvzfeRufulDpMW9

    IRR కేసు.. చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ సమయం కోరడంతో విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

    మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల

    ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    సీఎం జగన్ పర్యటన వాయిదా

    సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా ప‌డిన‌ట్లు సీఎంవో ప్రకటించింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్ద సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్‌ చేసి మరో తేదీని ప్రకటించనున్నారు.

    ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయొచ్చు: కొడాలి నాని

    వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా సరిపోతుందని తెలిపారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి టీడీపీ, జనసేన నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.