SAME SEX MARRAIGE కుదరదా!… సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SAME SEX MARRAIGE కుదరదా!… సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది?

    SAME SEX MARRAIGE కుదరదా!… సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది?

    March 14, 2023

    దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన అంశం స్వలింగ వివాహాలు ( same sex marraige ). వీటిని కేంద్రం వ్యతిరేకించడమే ఇందుకు ప్రధాన కారణం. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇవి ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని.. ఈ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థతో సరితూగవని తేల్చి చెప్పింది. అసలు ప్రస్తుతం ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది. దేశంలో ఇలాంటి తరహా వివాహాలు ఉన్నాయా? అనేది తెలుసుకోండి.

    ఏం జరుగుతోంది ?

    స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధత కల్పించాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం… కేంద్రాన్ని వివరణ కోరింది. విస్తృతంగా చర్చించిన కేంద్ర సర్కారు ఈ పెళ్లిళ్లను పూర్తిగా వ్యతిరేకించింది. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని, వాటికి చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేశారు. ఒకవేళ కల్పించితే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సమతౌల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు.

    రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు

    కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇందులో రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టం, ప్రత్యేక శాసన చట్టాలతో ముడిపడి ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంబంధిత పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ కేసు వాయిదా వేశారు.

    స్వలింగ జంటలు

    దేశంలో Same sex ఉన్న జంటలు పెళ్లి చేసుకున్న సంఘటనలు జరిగాయి. గతేడాది కేరళకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వేరు చేసినా ఒక్కటయ్యారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో కేరళ కోర్టు వీరిద్దరూ కలిసి ఉండేందుకు అనుమతిచ్చింది. 

    ఈ LGBT కపుల్స్‌లో ముంబయికి చెందిన అదితి ఆనంద్, సుసాన్ దియాస్ కూడా ఒకరు. గడిచిన 12 సంవత్సరాలుగా వాళ్లు కలిసి జీవిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఇద్దరూ రెండు సినీ ప్రొడక్షన్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. వారి పెళ్లిని చట్టబద్ధం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈ జంట. 

    ఓకే చెప్పిన దేశాలు

    ఆసియాలో స్వలింగ వివాహాలను ఆమోదించిన మెుట్ట మెుదటి దేశం తైవాన్. అక్కడ ఈ పెళ్లిళ్లను చట్టబద్ధం చేశారు. ఇజ్రాయెల్‌ కూడా వీటికి ఓకే చెప్పింది. బ్రిటన్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఈ వివాహాలు చట్టబద్ధం. కాంబోడియాలో కొన్ని షరతులు, నిబంధనల నడుమ వీటిని ఆమోదించారు.  జపాన్‌ వంటి అగ్రదేశంలో పెళ్లి జరిగినట్లు సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. 

    జంటలకు రక్షణ

    ఈ వివాహాలు చేసుకున్న జంటలకు కుటుంబాల నుంచి ప్రాణహాని ఏర్పడే పరిస్థితి వచ్చింది. భారత్‌లో చట్టబద్ధం కాకపోయినప్పటికీ కొన్ని కోర్టులు ఈ జంటల రక్షణ కోసం చర్యలు తీసుకున్నాయి. గే కపుల్స్ కలిసి ఉండవచ్చని కేరళ హైకోర్టు 2022లో తీర్పు ఇచ్చింది. 2019లో ఉత్తరాఖండ్ హైకోర్టు వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. హర్యానా హైకోర్టు కూడా గే జంటలకు కుటుంబాల నుంచి హానీ జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది.

    ఆమోదించిన ఆరెస్సెస్‌

    స్వలింగ సంపర్కుల వివాహాలను ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భగవత్ సమర్థించారు. వారు భారతీయ సొసైటీలో భాగమేనని.. దేశంలో వారికి నచ్చిన విధంగా ఉండే అవకాశాలు కల్పించాలని అన్నారు. భాజపా సర్కారు RSS భావజాలాన్ని కలిగి ఉంటుందనే నేపథ్యంలో కేంద్రం ఈ వివాహాలను వ్యతిరేకించడం కాస్త ఆశ్చర్యమే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version