Samsung Galaxy M55s 5G: డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్న సామ్సంగ్ కొత్త ఫొన్.. ధర ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy M55s 5G: డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్న సామ్సంగ్ కొత్త ఫొన్.. ధర ఎంతంటే?

    Samsung Galaxy M55s 5G: డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌తో వస్తున్న సామ్సంగ్ కొత్త ఫొన్.. ధర ఎంతంటే?

    September 18, 2024

    సామ్సంగ్ తన కొత్త M సిరీస్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ M55s 5Gని ఇండియాలో త్వరలో విడుదల చేయనుంది. ఈ గ్యాడ్జెట్ విడుదలైన తర్వాత నేరుగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫొన్ అమెజాన్ వెబ్‌సైట్‌లో రన్‌ అవుతూ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మొత్తం వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    సెప్టెంబర్ 23న విడుదల

    సెప్టెంబర్ 23న గెలాక్సీ M55s 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్స్‌కు ముందు ఉంటుంది. దీనిని బట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌లో ఇది విక్రయానికి అందుబాటులోకి రావచ్చని అర్థమవుతోంది. అమెజాన్‌ ఇప్పటికే ఫోన్ డిజైన్, ఫీచర్లను వెల్లడించింది.

    సామ్సంగ్ గెలాక్సీ M55s 5G స్పెసిఫికేషన్స్

    డిస్‌ప్లే

    గెలాక్సీ M55s 5G 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 1,000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది, మంచి విజువల్ అనుభవం కల్పిస్తుంది. ఫొన్ ఫోన్ కేవలం 7.8mm మందంతో ఉంటుంది. దీని స్లీక్ డిజైన్ వినియోగదారుడికి హ్యాండీ ఫీలింగ్‌ను అయితే ఇస్తుంది. ఇది కరల్ గ్రీన్, థండర్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది..

    కెమెరా

    గెలాక్సీ M55s 5Gలో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50MP ప్రధాన సెన్సార్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇది ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియోలను రికార్డ్ చేసే డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

    ప్రాసెసర్

    ఇది శక్తివంతమైన Snapdragon 7 Gen 1 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది. దీంతో ఫొన్ పనితీరు చక్కగా ఉంటుంది. గేమింగ్, వీడియో ప్రాసెసింగ్‌ సమయంలో ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్‌ లేకుండా ఉంటుంది. 

    మెమోరీ

    గెలాక్సీ M55s 5Gలో 8GB RAM, 128GB అంతర్గత మెమరీతో రానుంది.  ఇది డైలీ థింగ్స్ నుంచి భారీ అప్లికేషన్ల వరకు అన్ని పనులను సాఫీగా నిర్వహిస్తుంది.

    బ్యాటరీ 

    ఇక బ్యాటరీ విషయానికొస్తే.. డివైస్ 5,000mAh బ్యాటరీతో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. గెలాక్సీ M55s టాప్ ఎండ్ కనెక్టివిటీని కలిగి ఉంది. బ్లూటూత్ v5.2, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

    ధర

    ఇండియాలో Samsung Galaxy M55s 5G అంచనా ధర 8GB RAM/128GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు దాదాపు రూ.26,999గా ఉండవచ్చు. ఇతర వేరియంట్‌లలో 8GB RAM/256GB మోడల్‌కు సుమారు రూ. 29,999 హై-ఎండ్ వెర్షన్ 12GB RAM/256GB వేరియంట్‌కు రూ.32,999 వరకు ఉండొచ్చని అంచనా.

    Buy Now On Amazon

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version