SPACE TOURISM: అంతరిక్ష ప్రయాణం… రూ. 6 కోట్లు మాత్రమే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SPACE TOURISM: అంతరిక్ష ప్రయాణం… రూ. 6 కోట్లు మాత్రమే

    SPACE TOURISM: అంతరిక్ష ప్రయాణం… రూ. 6 కోట్లు మాత్రమే

    March 16, 2023

    అంతరిక్ష ప్రయాణాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ధరలోతో తీసుకువచ్చేందుకు ఇస్రో అడుగులు వేస్తోంది. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. 

    2030 నాటికి రూ. 6 కోట్లతో అంతరిక్షానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ సోమనాథ్ వెల్లడించారు.

    ప్రభుత్వం తరఫున అంతరిక్ష ప్రయాణం ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న ధరలతో పోలీస్తే అతి తక్కువగా ఉండేలా చూసుకుంటున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

     “ భారతదేశానికి సంబంధించిన స్పేస్‌ టూరిజం మాడ్యూల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది సురక్షితమైనది. దీన్ని మళ్లీ వినియోగించవచ్చు. టికెట్ ధర రూ. 6 కోట్లు ఉండవచ్చు. అంతరిక్షానికి వెళ్లిన ప్రజలు తమకు తాము వ్యోమగాములగా పిలుచుకోవచ్చు” అని సోమనాథ్ అన్నారు. 

    అయితే, ఈ యాత్ర ఎంత దూరం వరకు ఉంటుందనే విషయం చెప్పలేదు. స్పేస్‌లో దాదాపు 15 నిమిషాలు ఉండవచ్చు. కొద్ది నిమిషాల పాటు తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రదేశంలో తిరగవచ్చు. పునర్వినియోగించే రాకెట్లను ప్రయాణానికి వాడతారు. 

    ఈ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన పనులపైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version