STEEL BRIDGE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం… దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం… ప్రత్యేకతలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • STEEL BRIDGE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం… దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం… ప్రత్యేకతలు ఇవే!

    STEEL BRIDGE: హైదరాబాద్ సిగలో మరో మణిహారం… దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం… ప్రత్యేకతలు ఇవే!

    August 19, 2023

    దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వ్యూహాత్మక రోడ్ల(SRDP) అభివృద్ధిలో భాగంగా 36వ ప్రాజెక్టుగా మంత్రి కేటీఆర్ దీనిని ప్రారంభించారు.  ఇందిరాపార్కు నుంచి VST వరకు 2.62 కిలోమీటర్ల పొడవున దీనిని నిర్మించారు. ఈ స్టీల్ బ్రిడ్జికి బీఆర్ఎస్ మాజీమంత్రి, దివంగత నేత నాయిని నరసింహారెడ్డి పేరును తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జికి పెట్టింది. మరి ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు, దీని వల్ల నగరవాసులకు కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.

    ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు వాహనాల ట్రాఫిక్‌, రవాణాలో చోటు చేసుకుంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రూ.450 కోట్లను ఖర్చు చేసి తెలంగాణ ప్రభుత్వం ఈ స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించింది.

    మొత్తం 2.62 కిలోమీటర్ల బ్రిడ్జిలో 2.437 కిలోమీటర్లు స్టీల్‌తో నిర్మించడం ప్రత్యేకత. దీని ఎలివేటెడ్ కారిడార్ రూ.2.436 కిలోమీటర్లు ఉంది. మొత్తం 81 పిల్లర్లతో చాలా దృఢంగా నిర్మించారు.

    హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో RTC క్రాస్ రోడ్స్ ఒకటి. ఇక్కడ వీపరితమైన ట్రాఫిక్ జామ్ వల్ల  దూరం తక్కువే అయినా.. ఈ క్రాస్ రోడ్లలో జర్నీకి చాలా టైమ్ పట్టేస్తుంది. దాదాపు 30 నిమిషాల నుంచి 40 సమయం వృథా అవుతుంది. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఈ ఫ్లై-ఓవర్‌ను అత్యంత ఎత్తులో నిర్మించింది.

    హైదరాబాద్‌లో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు తెలంగాణ సర్కారు వ్యూహాత్మక రహదారులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా 48 ప్రాజెక్టులు చేపట్టగా.., ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇందిరాపార్క్- వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్  ఫ్లై ఓవర్‌ 36వది.

     

    ఈ ఉక్కు వంతెన నిర్మాణానికి  దాదాపు 20 మెట్రిక్‌ టన్నుల ఐరన్ వాడారు. ఇది దక్షిణాదిలో మొదటి పొడవైన స్టీల్ వంతెన కావడం విశేషం. అంతే కాకుండా GHMC చరిత్రలో భూసేకరణ లేకుండానే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే.

    హైదరాబాద్‌లో మైట్రో రైల్‌ రూట్ మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ కావడం మరో ప్రత్యేకత. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణం వల్ల సికింద్రాబాద్‌, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే  ప్రయాణికుల ప్రయాణం తేలిక అవుతుంది. 

    ఈ ఫ్లై-ఓవర్ ద్వారా.. విద్యానగర్, ఉప్పల్, నల్లకుంట వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు  ఈ  స్టీల్‌ బ్రిడ్జీ ఫ్లై ఓవర్‌ మెట్రోలైన్‌పై నిర్మించారు. దీనివల్ల ఈ కారిడార్‌కు మరింత ఎలివేషన్ లభించింది. దాదాపు ఆకాశంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.

    గతంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వద్ద విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండేది. ఈ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించింది.

    ఇందిరా పార్కు, అశోక్‌ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, బాగ్‌ లింగంపల్లి క్రాస్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ రద్దీకి ఉపశమనం లభించినట్లైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version