జీ20 సమావేశాలు అస్సాంకే గర్వకారణం
జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించనున్న భారత్ వరుస సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 2 నుంచి 3 వరకు ‘సస్టెయినబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్’ జరగనుంది. ఈ సమావేశాలకు జీ20 దేశాలకు చెందిన 94మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌తో పాటు మరో 4 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుండటం అస్సాంకు గర్వకారణమని నోడల్ అధికారి వెల్లడించారు. ‘వసుధైవ కుటుంబం’ మోటోతో ‘వన్ ఎర్త్. వన్ ఫ్యామిలీ. వన్ ఫ్యూచర్’ థీమ్‌తో భారత్‌లో జీ20 సమావేశాలు జరుగుతున్నాయి.