• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్నికల తేదీల విషయంలో బీజేపీ వ్యూహం..?

    ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే తేదీల విషయంలో సీఈసీని బీజేపీ ప్రభావితం చేసిందా అనే అనుమానం కలుగుతోందని పలువురు అంటున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మిజోరాం, మధ్యప్రదేశ్‌లలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం.. ఆ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో చివరలో ఎన్నికలుండటమే దీనికి కారణమనే వాదన వినిపిస్తోంది. ముందుగా తాము అధికారంలో ఉన్న చోట ఎన్నికలు పూర్తి చేస్తే ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒత్తిడి లేకుండా ప్రచారం చేసుకునేందుకే ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఉచిత హామీలను అడ్డుకోలేం: సీఈసీ

    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను తాము అడ్డుకోలేమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో ఎన్నికల హామీలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలను ఎప్పటి లోగా అమలు చేస్తాయో రాజకీయ పార్టీలు చెప్పేలా ఒక విధానం తీసుకొచ్చామని చెప్పారు. హామీలను ఏ విధంగా, ఎప్పటి లోగా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని రాజీవ్ పేర్కొన్నారు.

    ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇవే

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనుండగా.. చత్తీస్‌ఘర్‌లో నవంబర్ 7, 17న రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17, రాజస్థాన్‌లో నవంబర్ 23న.. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.