‘ఫుడ్ ప్యాకింగ్‌పై డేట్ ఉండాల్సిందే’
ఫుడ్ పార్శిళ్లపై అందులోని ఆహార పదార్ధాలు ఎప్పుడు తయారయ్యాయో ఖచ్చితంగా దానిపై ముద్రించాలని కేరళ ఫుడ్ సేఫ్టీ విభాగం ఆదేశించింది. ఈ విధానం అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హోటళ్ల నిర్వాహకులు, ఫుడ్ ప్రొడక్ట్స్ మేకర్స్ అందరూ హెల్త్ కార్డులు తీసుకోవాలని పేర్కొంది. కాగా ఇటీవల కేరళలో వరుస ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.