అమ్మ చేతి వంట ఎంత అద్భుతంగా ఉన్నా.. మన మనసంతా పక్కనున్న పానీపూరి బండిమీదే ఉంటుంది. ఓ వ్యక్తి నాలుగు చక్రాల బండి దగ్గర దర్జాగా నిల్చొని ఒక చేతితో బిందెలోని పుదీనా నీరు కలుపుతూ.. మరో చేతితో మనకు పానీపూరి వడ్డిస్తుంటే..ఆహా ఏమీ రుచి.. తినరా మైమరిచి అంటూ ఒక్కో పానీపూరిని అమాంతంగా నోరు తెరిచి అరక్షణంలో స్వాహా చేసే ప్రతిభావంతులు మనపక్కన చాలా మంది ఉంటారు. ‘భాయ్ తోడా ప్యాజ్ దాలో’ అంటూ వచ్చి రాని హిందీతో ఇష్టమైన పానీపూరి తినేవారికి ఈ రసగుల్లా చాట్ గురించి తెలుసా..? డ్రైఫ్రూట్స్ దగ్గరి నుంచి దంచికొట్టే మసాలా ఫ్లేవర్ వరకు యాడ్ చేసి ఎంతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చాట్ మీరు తినగలరా..? అసలు దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..? తెలియకుంటే వెంటనే ఈ కింది వార్తను చదవండి.
మనలో చాలామందికి బఠాణీ చాట్, చానా చాట్, బంగాళదుంప చాట్, సమోసా చాట్ తెలుసు. కాని ఈ రసగుల్లా చాట్ ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూసి ఉండం. దానికి తోడు దీన్ని తినే ధైర్యం చేసినా గొప్ప అనే చెప్పుకోవాలి. ఎందుకంటారా..? ఎందుకంటే ఇది వైరల్ వంటకం. దిల్లీలోని కరోల్ బాగ్ వద్దగల చైనా మార్కెట్లో ఈ రసగుల్లా చాట్ లభిస్తుందని ‘Delhi Food Nest’ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్లు వివరించారు. అలాగే ఈ చాట్ ఎలా తయారు చేస్తారో కూడ వీడియోలో రూపొందించారు. ఈ వీడియోను @KaptanHindostan అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. రసగుల్లల్లోని రసం తీసి వాటికి కారం..టొమాటో సాస్.. ఇతర చట్నీలు, మసాలాలు యాడ్ చేసి.. చివరికి వాటిపై డ్రైఫ్రూట్స్ చల్లుతూ తయారు చేసిన విధానం వైరల్ అయ్యింది.
ఈ చాట్ తినడానికి ఎలా ఉంటుందో తెలీదు కాని. తయారు చేసే విధానంపై మాత్రం నెటిజన్లు ఫన్నీ మీమ్‌లు సంధించారు. ‘ఈ వంటకం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నాయనా’ అంటూ కొందరు.. ‘ఇది అసలు తినొచ్చా’ అని మరికొందరు నవ్వులు పూయించే మీమ్‌లు, GIFలు సృష్టించారు. రుచి ఎలా ఉందో ఎవరికి తెలియదు కాని ఈ వంటకం మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఈ రసగుల్లా చాట్ మీరు తయారు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోలు చూడండి. ధైర్యం ఉంటే తిని చూడండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!