• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెజ్లర్లను అడ్డుకున్న భద్రతా సిబ్బంది

    నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఉండటంతో రెజ్లర్లు మహిళా మహాపంచాయత్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంట్ వరకు మార్చ్‌ని నిర్వహిస్తుండగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంది. జంతర్ మంతర్ నుంచి తరలివస్తుండగా రెజ్లర్లను అధికారులు నిర్బంధించారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని రెజ్లర్లు సంకల్పించినా పోలీసులు అడ్డుకోవడంతో వారు నిరసన తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్‌భూషణ్‌కి వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. #WATCH | Delhi: Security personnel stop & detain protesting wrestlers as they … Read more

    సినిమా స్టార్ల ట్వీట్.. ప్రధాని రిప్లై

    సినీ సెలబ్రిటీలు రజినీకాంత్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనం విశిష్ఠతలను వివరిస్తూ వీరు తమ వాయిస్ ఓవర్ ఇచ్చి ట్వీట్ చేశారు. వీరికి మోదీ రిప్లై ఇచ్చారు. షారూక్ ట్వీట్‌కి స్పందిస్తూ అద్భుతంగా వర్ణించారన్నారు. ‘అద్భుతంగా వర్ణించారు. ప్రజాస్వామ్య పురోగతికి ఈ నూతన పార్లమెంట్ భవనం నిదర్శనం. సంప్రదాయం, ఆధునికతల మేళవింపు’ అని రిప్లై ఇచ్చారు. తలైవా రజినీకాంత్, అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియోను సైతం ప్రధాని రీట్వీట్ చేశారు. Beautifully expressed! … Read more

    ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేది: ఓవైసీ

    నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా జరిగితే బాగుండేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ అగ్నిమాపక శాఖ అంగీకారం కూడా లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఓ శవపేటికతో సమానం అన్న ఆర్జేడీ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందించారు. ‘ఆర్జేడీకి నిశ్చితాభిప్రాయం లేనట్లుంది. శవపేటికతో పోల్చడం సరైంది కాదు. వేరే ఏదైనా పదాలు వాడాల్సింది. ఈ కోణంలో మాట్లాడటం తగదు’ అని అసదుద్దీన్ చెప్పారు. #WATCH | It would … Read more