• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓకే ఓకే జీవితం నుంచి అమ్మ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

    హీరో శర్వానంద్ యాక్ట్ చేసిన ఓకే ఓకే జీవితం మూవీ నుంచి అమ్మ పాట ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. వీడియో పాటలో నటి అమల, శర్వానంద్ మధ్య సాగే మదర్ సెంటిమెంట్ మనసుకు హత్తుకునేలా ఉందని చెప్పవచ్చు. అలరిస్తున్న ఈ ఎమోషనల్ మదర్ సాంగ్‌ను మీరు కూడా ఓ సారి వినేయండి మరి.

    ఒకే ఒక జీవితం మూవీ ఫుల్ రివ్యూ

    పెద్దగా ఆడంబరం లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా అమల, నాజర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టైం ట్రావెల్ కథగా ప్రేక్షకులను పలకరించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుడిని థియేటర్లో మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? టైం ట్రావెల్ సినిమాలనగానే మనలో తెలియని ఆసక్తి. అవకాశమొస్తే మన తప్పులను సరిదిద్దుకోవాలని ఎదురుచూస్తుంటాం. అలా మన చిన్నతనంలో జరిగిన ఘటనలను మార్చే ఛాన్స్ … Read more

    పావు హైదరాబాద్ శర్వానంద్‌దే! అంత రిచ్‌!!

    ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతన్నాడు శర్వానంద్‌. అయితే శర్వానంద్‌ చాలా సంపన్నుడన్న విషయం చాలా మందికి తెలియదు. తను కావాలనుకుంటే సొంత డబ్బుతో సినిమాలు తీసుకోగలడు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శర్వా చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో యాంకర్‌ ‘పావు హైదరాబాద్ మీదేనంట’ అంటాడు. అప్పుడు శర్వా ‘అంత లేదు గానీ బాగానే ఉన్నాయి.కావాలనుకుంటే నా సినిమాలు నేనే తీసుకోగలను’ అని సమాధానమిచ్చాడు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. intha rich ah sharwa ? … Read more

    ఒకే ఒక జీవితం చూసి నాగార్జున కంట‌త‌డి

    శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం స్పెష‌ల్ స్కీనింగ్ చూసింది. వారితో పాటు నాగార్జున‌, అమ‌ల‌, శ‌ర్వానంద్ కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ క‌లిసి సినిమాను చూశారు. నాగార్జున మాట్లాడుతూ నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అంద‌రూ కంట‌త‌డితో బ‌య‌ట‌కు రావ‌డం చూడ‌వ‌చ్చు. అమ్మ మీద ప్రేమ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంద‌ని చెప్తున్నారు.

    ‘ఒకే ఒక జీవితం’ సెలబ్రిటీ రివ్యూ

    శర్వానంద్‌ హీరోగా వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఇవాళ సెలబ్రెటీలకు ప్రీమియర్‌ షో వేశారు. అయితే సినిమా అద్భుతంగా ఉందని నాగార్జున, అమల, రీతూవర్మ తదితరులు చెప్పారు. సినిమా చూస్తుంటే తనకు అమ్మ గుర్తొచ్చిందని అన్నారు. అమల నటల మరో స్థాయిలో ఉందని పలువురు ప్రముఖులు చెప్పారు. టైం ట్రావెల్‌ సినిమా అయినపుడు ఎమోషనల్‌గా ఉందని, కంటతడి పెట్టించిందని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఎమోష‌న‌ల్‌గా ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్‌

    శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. జీవితంలో మ‌ళ్లీ ఒక‌సారి వెన‌క్కి వెళ్లి త‌న అమ్మ‌ను క‌లుసుకోవాల‌నుకున్న హీరోకి ఎటువంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి అనే విష‌యాల్ని ట్రైల‌ర్‌లో ఎమోష‌న‌ల్‌గా చూపించారు. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రీతూ వ‌ర్మ హీరోయిన్‌. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిశోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. సెప్టెంబ‌ర్ 9న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది.

    శ‌ర్వానంద్ కోసం పాట పాడిన కార్తి

    శ‌ర్వానంద్ న‌టిస్తు ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో హీరో కార్తి ఒక పాట పాడారు. జేక్స్ బొజోయ్ సంగీతం అందించిన మారిపోయే అనే పాట‌తో కార్తి అల‌రించాడు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ సెప్టెంబ‌ర్ 9న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. రితూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సీనియ‌ర్ న‌టి అమ‌ల శ‌ర్వానంద్‌కు త‌ల్లిగా క‌నిపించ‌బోతుంది. వెన్నెల కిశోర్, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

    ఒకే ఒక జీవితం నుంచి ‘మారిపోయే’ సాంగ్ విడుదల

    శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఓకే జీవితం’. అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ‘మారిపోయే’ అనే సాంగ్ విడుదలైంది. తమిళ స్టార్ హీరో కార్తీ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌కు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించగా కృష్ణ చైతన్య లిరిక్స్ రాశాడు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది.

    26న ‘ఒకే ఒక జీవితం’ నుంచి మూడో సాంగ్ విడుదల

    శర్వానంద్, రీతూవర్మ జంటగా, అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఈనెల 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు’మారిపోయే’ అంటూ సాగే మూడో సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్‌ను ఓ పెద్ద హీరో పాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.