• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • త్రిష పెదాలపై ముద్దు పెట్టిన బుడ్డోడు

  [VIDEO:](url) వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘త్రిష’. తాజాగా ఈ అమ్మడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్-1’లో నటించింది. కుందవై పాత్రలో అటు అందంతో, ఇటు నటనతో ప్రేక్షకుల మదిని దోచేసింది. అయితే, ఈ భామ పెదాలపై ఓ బుడ్డోడు ముద్దు పెట్టేశాడు. కాకపోతే నేరుగా కాదు.. పోస్టర్‌పై. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై త్రిష స్పందించింది. ట్విటర్ వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ.. లవ్ సింబల్ జతచేసింది. 🥹❤️ pic.twitter.com/NRbX4OesXG — … Read more

  పీఎస్ 2 రిలీజ్ అప్పుడేనా..!

  మణిరత్నం కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్1’. సెప్టెంబరు 30న విడుదలై ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. తొలి భాగంలో చివరికి ట్విస్టుతో రెంబో భాగంపై డైరెక్టర్ ఆసక్తి కలిగించారు. దీంతో రెండో భాగం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర నిర్మాతలు దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారట. కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల … Read more

  PS1 థాంక్స్ గివింగ్ మీట్

  కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 30న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్స్ గివింగ్ మీట్’ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరోలు కార్తి, జయం రవి, డైరెక్టర్ మణిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్రిష, ఐశ్వర్యారాయ్, విక్రమ్ కీలక పాత్రల్లో అలరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. Courtesy Twitter:@vamsikaka Courtesy Twitter: Courtesy Twitter: Courtesy … Read more

  ఓటీటీలోకి ‘పొన్నియన్ సెల్వన్1’

  మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్1’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ సినిమా అన్య భాషల వారిని ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. వచ్చే నెల మొదటి, రెండో వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. కానీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ఇందులో నటించారు.

  సినీ రౌండప్ @10.30PM

  ఆదిపురుష్ చేయడానికి సంకోచించా: ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్‌పై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ తమన్నా అందాల విందు విడాకులు వెనక్కి తీసుకోనున్న ధనుష్ఐశ్వర్య? సంతోషంలో మునిగిపోయిన కార్తి రామమందిరంలో ‘ఆదిపురుష్’ టీం మాస్ స్టోరీ.. క్లాస్ మేకింగ్ ఆమెను చూసి అసూయ కలిగింది: మీనా

  సంతోషంలో మునిగిపోయిన కార్తి

  పొన్నియన్ సెల్వన్ 1 సినిమా అద్భుత విజయం సాధించడంతో హీరో ‘కార్తి’ సంతోషంలో మునిగిపోయాడు. సినిమాను ప్రజలు ఆదరిస్తున్న తీరుకు ఈ యువ నాయకుడు ఉబ్బి తబ్బిబ్బవుతు న్నాడు. ఈ సినిమాలో కార్తి వల్లవరాయుడిగా ప్రేక్షకులను అలరించాడు. దీంతో కార్తి చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇంతటి అద్భుత నవలను అందించిన కల్కికి, దీనిని అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నంకి సెల్యూట్. ఏఆర్ రెహ్మాన్, రవి వర్మన్‌ల పనితీరు అమోఘం’ అని పేర్కొన్నాడు.

  ఓవర్సీస్‌లో ‘PS1’ అదుర్స్

  ఓవర్సీస్‌లో పొన్నియన్ సెల్వన్ 1 అదరగొడుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఆస్ట్రేలియాలో 86 సెంటర్లలో విడుదల కాగా, మధ్యాహ్నం వరకు 3,47,757 డాలర్లు వసూళ్లు చేసింది. న్యూజిలాండ్‌లో 23 కేంద్రాల్లో విడుదలై 33,020 డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఆస్ట్రేలియాలో ఈ రోజు రాత్రివరకల్లా సుమారు 4లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. నేడు విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్వదేశంలోనూ బాగా ఆడుతోంది.

  విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్

  మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరో విజువల్ వండర్ లా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ లో రానా వాయిస్ ఓవర్ గొప్పగా సాగింది. చోళుల కాలంలో జరిగిన సంఘటనలు కళ్లకు కట్టేలా ట్రైలర్ లో ఉన్నాయి. విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా ప్రతి పాత్ర ప్రధానమైందే. ఆస్కార్ విన్నర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో అడ్వాంటేజ్ గా నిలవనుంది. కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల … Read more

  బాహుబలి నా బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ : మణిరత్నం

  భారత చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యుత్తమ దర్శకుల జాబితాలో మణిరత్నం ఖ‌చ్చితంగా ఉంటారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయ‌న‌ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ సినిమాలకు దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముటీ, షారుఖ్ ఖాన్ వంటి వారితో కలిసి పనిచేశారు. ప్ర‌స్తుతం పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే సినిమాను ప్ర‌తిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా తీయడానికి రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ బాహుబలి సినిమా నా ఇన్‌స్పిరేషన్‌ అని పేర్కొన్నారు.