ప్రజలకు ఆ హక్కు లేదు: కేంద్రం
రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘సరైన వ్యక్తిని ఎన్నుకొనేందుకు అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కానీ, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే హక్కు వారికి లేదు. రాజ్యాంగపరమైన చట్టం లేనందున ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దాతల వివరాలు గోప్యంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.