• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సిరాజ్ నన్ను పిల్లాడివి పిల్లాడిలా ఉండు అన్నాడు: రియాన్ పరాగ్

  ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ మ్యాచులో హర్షల్ పటేల్ తో గొడవపై రియాన్ పరాగ్ స్పష్టతనిచ్చాడు. ‘గత సీజన్లో హర్షల్ నన్ను ఔట్ చేసినపుడు ఇక వెళ్లు అన్నట్టు చేయి ఊపాడు. ఈసారి చివరి ఓవర్ లో నేను అతని బౌలింగ్ లో కొట్టినపుడు నేనూ అదే చేశా’ అని పరాగ్ చెప్పాడు. అయితే గొడవ జరిగాక సిరాజ్ తనను దగ్గరికి పిలుచుకుని ‘నువ్ పిల్లాడివి పిల్లాడిలా ఉండు’ అని చెప్పాడని తెలిపాడు. హర్షల్ తో తాను ఎలాంటి వాగ్వాదానికి దిగలేదని పేర్కొన్నాడు.

  రాహుల్ ఇంకా మెరుగుపడాలన్న పాక్ మాజీ క్రికెటర్

  టీమిండియా వైస్ కెప్టెన్, IPL లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పై పాక్ మాజీ క్రికెటర్ రషీఫ్ లతీఫ్ పలు సంచలన ఆరోపణలు చేశాడు. ఐపీఎల్ లో రెండో అత్యధిక స్కోరు 616 పరుగులు చేసిన రాహుల్ హిట్ మ్యాన్ శర్మ, విరాట్ కోహ్లీల కంటే గొప్పవాడు కాదని ఆయన తెలిపాడు. రాహుల్ గొప్ప క్రికెటరే అయినా వారి కంటే గొప్ప వ్యక్తి కాదని అన్నాడు. రాహుల్ తనను తాను మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపాడు.

  కోహ్లీ, రోహిత్‌కు చోటివ్వని సచిన్

  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన IPL-2022 బెస్ట్ XI ప్రకటించాడు. ఈ లిస్ట్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటివ్వలేదు. ఆటగాళ్ల గత ప్రదర్శనను పరిగణలోకి తీసుకోలేదని, కేవలం ఈ సీజన్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా టీం ఎంపిక చేశానని ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సచిన్ టీంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను ఎంపిక చేశాడు. అతని టీం ఇదే. సచిన్ XI: బట్లర్‌, ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), మిల్లర్‌, … Read more

  ఐపీఎల్ గ్రౌండ్ సిబ్బందికి బీసీసీఐ నజరానా

  సుమారు 2నెలల పాటు వినోదాన్ని పంచిన ఐపీఎల్ విజయవంతంగా ముగిసింది. ఆటగాళ్లు అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ప్రతీ మ్యాచ్ రసవత్తరంగా సాగేలా ఉపయోగపడే క్యూరేటర్లు, గ్రౌండ్ సిబ్బంది మాత్రం ఎప్పుడూ తెరవెనుక హీరోల్లానే మిగిలిపోతుంటారు. వారి కోసం బీసీసీఐ ఈసారి భారీ నజరానా ప్రకటించింది. గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్లకు మొత్తం రూ.1.25 కోట్లు అందించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణె మైదానాలకు రూ.రూ.25 లక్షల చొప్పున ప్రకటించారు. ఈడెన్‌గార్డెన్స్‌, నరేంద్రమోదీ స్టేడియాలకు రూ.12.5 లక్షల చొప్పున అందిస్తామని వెల్లడించారు.

  ‘హార్దిక్ పాండ్యా’ కేవలం ఆటగాడు కాదు!

  గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే జట్టుకు కప్పు అందించిన హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. అతడి ఆటపైనే విమర్శలు వస్తున్న వేళ కెప్టెన్ గా కూడా రాణించి వేల నోళ్లు మూయించాడు.లీగ్ దశ నుంచి కప్పు కొట్టే వరకూ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హార్దిక్ కేవలం ఆటగాడు కాదు గొప్ప నాయకుడంటూ సీనియర్ క్రికెటర్లు కొనియాడుతున్నారు. టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ గానూ ఎదగగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab … Read more

  IPL: 14 ఏళ్లలో ఇది రెండోసారి

  టాటా ఐపీఎల్ 15వ సీజన్ విజేతగా హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో గుజరాత్ జట్టు విజయానందంలో ముగినిపోయింది. అయితే ఐపీఎల్‌లో మొట్టమొదటగా ఎంట్రీ ఇచ్చి టైటిల్ సాధించిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. 14 ఏళ్లలో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ఓ జట్టు కప్ సాధించడం ఇది రెండోసారి మాత్రమే. మొదటగా 2008లో రాజస్థాన్ రాయల్స్ ఈ … Read more

  IPL 15 విజేతగా గుజరాత్ టైటాన్స్

  టాటా ఐపీఎల్ 2022 15వ సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య(34), శుభ్‌మన్ గిల్(45), డేవిడ్ మిల్లర్(32) రాణించడంతో GT 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతూ.. ఫైనల్‌కు GT, తుది పోరులో కూడా అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. కాగా సీజన్‌లో కొత్తగా వచ్చి అతి తక్కువ మ్యాచెస్‌ ఆడి టైటిల్ గెలిచిన జట్టుగా … Read more

  IPL FINAL: విఫలమైన RR బ్యాటర్లు.. GT టార్గెట్ 131

  టాటా ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(22), బట్లర్(39) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో నిర్ణిత ఓవర్లలో RR 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అటు గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, సాయి కిషోర్ 2, రషీద్ ఖాన్, యాష్ దయాళ్, షమీ తలో వికెట్ తీసుకున్నారు. ఈ ఫైనల్‌ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించాలంటే 132 పరుగులు చేయాల్సి ఉంటుంది.

  నేడు స్నేక్ షాట్ ఆడతా: రషీద్ ఖాన్

  మొదటి సీజన్ ఆడుతూ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతుంది. అద్భుతమైన విజయాలతో ఫైనల్ చేరింది. గుజరాత్ విజయాల్లో ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. వికెట్లు తీసుకోవడంతో పాటు, కీలక మ్యాచెస్‌లో తన బ్యాట్‌తో విజయాలను అందించాడు. అతని బ్యాటింగ్‌లో స్పెషల్ స్నేక్ షాట్. ఆ షాట్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే దీనిపై రషీద్ ఖాన్ స్పందించాడు. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న ఫైనల్ పోరులో అవకాశం వస్తే తప్పకుండా ఆ … Read more

  ‘ఐపీఎల్-2022’ ఇది కొంచెం డిఫరెంట్ గురూ!

  ఒకరిదేమో అంచనాలకు మించిన అద్భుత ఆటతీరు.. మరొకరిది అభిమానుల ఆశలను నీరుగార్చిన అత్యంత పేలవ ప్రదర్శన. ఒక జట్టుదేమో అందని మామిడిపండ్లు కూడా అరచేతిలో పడే అదృష్టం….మరో జట్టుదేమో చేతిలో ఉన్న గేమ్ పాదరసంలా జారిపోయేంత దురదృష్టం. అంతా కొత్తగా మొదలైన ఐపీఎల్ 2022 అభిమానులకు కూడా కొత్త అనుభూతిని పంచింది. అసలు ఏ జట్టు ఎలా ఆడింది? ఈసారి భారత క్రికెట్ కు ఐపీఎల్ అందించిన ఆణిముత్యాలెవరు? అన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ [ఆర్టికల్](url) చదవండి. లేదా విసిట్ వెబ్ సైట్ పై … Read more