• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2022: ఈ రికార్డులు బద్దలుకొడతారా ?

    ఐపీఎల్ అంటే రికార్డుల వేట వినోదపు మూట. అలాంటి ఐపీఎల్ సరికొత్త సీజన్‌కు సిద్ధమైంది. టాటా ఐపీఎల్ 2022 రేపు మొదలవనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో కొన్ని తిరుగులేని రికార్డులు ఉన్నాయి. వాటిని ఈ సీజన్‌లో అయినా వచ్చే సీజన్లలో అయినా ఎవరైనా తిరగ రాస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ రికార్డ్స్ ఏవంటే.. 2016లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో ఒక సీజన్లో 973 పరుగులు చేశాడు, 2013లో RCB ప్లేయర్ గేల్ ఒక మ్యాచ్‌లో 175 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. అటు ఒక జట్టును అత్యధికంగా 9 సార్లు ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌గా ధోని రికార్డును ఎవరు ఛేదిస్తారో. 2019లో ముంబై ఇండియన్స్ బౌలర్ ఆల్‌జారీ జోసెఫ్ 3.4 ఓవర్లు వేసి 6 వికెట్లు తీశాడు. దీంతో పాటు 16 డాట్ బాల్స్ వేసి కేవలం 12 పరుగులే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతని ఎకానమీ 3.27. ఇక అత్యంత చెత్త రికార్డుగా పేరున్న ఈ రికార్డును ఎవరు కోరుకోరు. 2017 KKRతో జరిగిన మ్యాచ్‌‌లో ఆర్సీబీ కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv