• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఖిల్ ఊర మాస్ ఇన్నింగ్స్; తెలుగు వారియర్స్ విజయం

    [వీడియో; ](url)అఖిల్ అక్కినేని ఊర మాస్ ఇన్నింగ్స్‌తో సీసీఎల్‌లో తెలుగు వారియర్స్ బోణీ కొట్టింది. కేరళ స్ట్రైకర్స్‌పై 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అఖిల్ పెను విధ్వంసమే సృష్టించాడు. కేవలం 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. అఖిల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో నాన్ స్ట్రైకర్ అవతలి వైపు కూర్చునే ఉండడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో అఖిల్ ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. తొలుత తెలుగు టీం 158 రన్స్ చేయగా కేరళ 94 పరుగులు మాత్రమే చేసింది. … Read more

    బిగ్‌బాష్ లీగ్ విజేతగా పెర్త్ స్కార్చర్స్

    బిగ్‌బాష్ లీగ్ 2023 విజేతగా పెర్త్ స్కార్చర్స్ అవతరించింది. పెర్త్‌లో జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదో [టైటిల్](url) తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్రిస్బేన్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఈ జట్టులో నాథన్ మెక్‌స్వీనీ (41) టాప్ స్కోరర్. అనంతరం పెర్త్ స్కార్చర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆ జట్టు కెప్టెన్ అస్టన్ టర్నర్ అర్ధసెంచరీతో(53) విజృంభించి టైటిల్ కట్టబెట్టాడు. కాగా 2014, 15, 17, 22, … Read more

    మెస్సీ మ్యాజిక్ గోల్స్ చూశారా?

    అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల సాకారమైంది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఉత్కంఠ పోరులో ఇరు జట్లు 3-3 గోల్స్ చేయడంతో షూటౌట్‌కు దారి తీసింది. అర్జెంటీనా షూటౌట్‌లో 4-2 తేడాతో గెలిచింది. అర్జెంటీనా తరఫున్ మెస్సీ 2 కళ్లు చెదిరే గోల్స్ కొట్టాడు. మరో వైపు ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాపే 3 గోల్స్‌తో పోరాడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని గోల్స్‌ను మీరూ చూసేయండి.

    టీ20 వరల్డ్‌కప్ విజేత ఇండియా

    భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో 120 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి [విజేత](url)గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2/277 పరుగులు చేసింది.సునీల్ రమేష్ (136), అర్జున్ (100) సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 157 పరుగులకే చాప చుట్టేసింది. కాగా భారత్‌ వరల్డ్‌కప్ గెలవడం ఇది వరుసగా మూడోసారి. 2012, 2017 ప్రపంచకప్‌లను భారత్ కైవసం చేసుకుంది. The winning moment of team India … Read more

    అర్జెంటీనా అధ్బుత పోరాటం

    ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఉత్కంఠ [విజయం](url) సాధించింది. చివరి వరకూ పట్టు విడవకుండా పోరాడి పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా గట్టెక్కింది. కెప్టెన్ లియోనల్ మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు కూడా 2 గోల్స్ కొట్టడంతో మ్యాచ్ సమమైంది. దీంతో ఎక్స్‌ట్రా టైంలోనూ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో అర్జెంటీనా విజయం సాధించింది. ??❤️ Another game closer… — FIFA World Cup … Read more