TDP మహిళా నేతపై లైంగిక వేధింపులు-రాజీనామా
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోడి అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. డోన్‌కు చెందిన ఓ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వెల్లడించారు. పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. వేధింపులు తాళలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అరుణ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందునే.. ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించామని పార్టీ నేత ఓ ప్రకటనలో తెలిపారు.