Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!

    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!

    May 3, 2023

    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ మీకోసం.. 

    1. ట్రైన్‌ సీన్‌ (వెంకీ)

    హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్‌ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. 

    2. బ్రహ్మీ vs నాజర్‌ (బాద్‌షా)

    బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్‌, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

    3. MS నారాయణ డైలాగ్స్‌ (దూకుడు)

    దూకుడు సినిమాలో ఎం.ఎస్‌ నారాయణ, మహేష్‌ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్‌ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్‌ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్‌ చెప్తున్న సమయంలో మహేష్‌ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది. 

    4. సునీల్‌ కాలేజ్‌ సీన్స్ (సొంతం) 

    శ్రీను వైట్ల తీసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో  ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్‌ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్‌ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్‌ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు. 

    5. బ్రహ్మీ ఫన్‌ వరల్డ్‌ సీన్స్‌ ( నువ్వు నాకు నచ్చావ్‌)

    వెంకటేష్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు. 

    6. క్విజ్‌ సీన్‌ (ఆగడు)


    ఆగడు సినిమాలో వచ్చే క్విజ్‌ సీన్‌ కూడా తెలుగు టాప్‌ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్‌ యాంకర్‌గా, వెన్నెల కిషోర్‌ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్‌గా నవ్వులు పూయించాడు. 

    7. బ్రహ్మీ సీన్స్ (అతడు)

    మహేష్‌ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్‌ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. 

    8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం)

    సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. 

    9. ఎస్కేప్‌ సీన్‌ (నమో వెంకటేశా)

    ‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్‌ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది. 

    10. బ్రహ్మీ రివేంజ్‌ (ఢీ)

    మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్‌, జయ ప్రకాష్‌ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్‌ తీర్చుకునే సీన్‌ సినిమాకే హైలెట్‌. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ‌అని చెప్పాలి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version