Pushpa 2 HD Movie Leak: ఓటీటీలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’ HD ప్రింట్ లీక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 HD Movie Leak: ఓటీటీలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’ HD ప్రింట్ లీక్

    Pushpa 2 HD Movie Leak: ఓటీటీలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’ HD ప్రింట్ లీక్

    December 28, 2024

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం విడుదలై 20 రోజులు దాటినా బాక్సాఫీస్‌ వద్ద జోరు మాత్రం తగ్గలేదు. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో సాలిడ్‌ వసూళ్లను రాబడుతూ అలరిస్తోంది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. మరిన్ని ఘనతలు సాధించేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ చిత్రానికి బిగ్‌షాక్‌ తగలింది. ఓటీటీలోకి రాకముందే ఈ మూవీ HD ప్రింట్‌ లీకైంది. మూవీ పైరసీ సెట్స్‌లో ‘పుష్ప 2’ (Pushpa 2 HD Movie Leak) అందుబాటులోకి వచ్చింది. 

    ‘పుష్ప 2’ HD వెర్షన్‌ లీక్‌..

    పుష్ప 2 సినిమా హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది. ఏకంగా ఓటీటీ వెర్షన్‍లా ఫుల్ క్లారిటీతో ఈ HD ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. పైరసీ సైట్లలో ‘పుష్ప 2’ క్వాలిటీ ప్రింట్‌ రావడంతో అందరూ ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. ప్రముఖ పైరసీ సైట్స్‌ అయిన మూవీరూల్జ్ (Movierulz), తమిళ్‌ రాకర్స్‌ (Tamilrockers), బప్పం (BAPPAM), ఫిల్మీజిల్లా (Filmyzilla), మూవీస్‌దా (Moviesda), టెలిగ్రామ్‌ ఛానెల్స్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. HD, FHD క్వాలిటీతో ఈ మూవీ వీక్షించండంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. 

    హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండింగ్‌..

    ప్రస్తుతం ‘పుష్ప 2’ పైరసీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలిగ్రామ్‌ ఛానల్స్‌లోనూ ఈ సినిమా డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ‘Pushpa 2 Movie Download’, ‘Pushpa 2 Movie HD Download’, ‘Pushpa 2 Tamilrockers’, ‘Pushpa 2 Filmyzilla’, ‘Pushpa 2 Telegram Links’, ‘Pushpa 2 Movie Free HD Download’ వంటి కీవార్డ్స్‌ నెట్టింట తెగ ట్రెండింగ్‌ అవుతున్నాయి. 

    ఎవరు లీక్‌ చేశారు?

    ‘పుష్ప 2’ సినిమాను జనవరి ఫస్ట్‌ వీక్‌లోనే ఓటీటీకి రాబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిని నిర్మాతలు ఖండించారు. 56 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. అప్పటివరకూ థియేటర్‌లోనే ‘పుష్ప 2’ను ఎంజాయ్‌ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే నాణ్యమైన ప్రింట్‌ లీక్‌ కావడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఒరిజినల్‌ ప్రింట్ అనేది మూవీ వర్గాల చేతిలోనే ఉంటుంది. అటువంటిది పైరసీ సైట్లకు ఎలా వచ్చిందన్న అంశం చర్చకు తావిస్తోంది. ఫిల్మ్‌ వర్గాలలోని వారే ఒరిజినల్ ప్రింట్‌ను లీక్‌ చేశారన్న అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 

    డిలీట్‌ చేసిన సాంగ్ మళ్లీ రిలీజ్‌

    ‘పుష్ప 2’ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌ను బన్నీ సవాలు చేస్తూ పాడే సాంగ్‌ బాగా పాపులర్ అయ్యింది. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్‌.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్‌’ అంటూ సాగే ఈ సాంగ్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డికి, బన్నీకి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ఈ పాటను రిలీజ్‌ చేయగా మరింత వివాదస్పదమైంది. పుండు మీద కారం చల్లినట్లు ఉందంటూ విమర్శలు రావడంతో మూవీ టీమ్‌ సాంగ్‌ను డిలీట్‌ చేసింది. రెండ్రోజుల వ్యవధిలోని తిరిగి ఆ సాంగ్‌ను మళ్లీ యూట్యూబ్‌లోకి తీసుకొచ్చింది. సినీ ప్రముఖులు ఇటీవల రేవంత్‌ను కలిసిన నేపథ్యంలో ఈ వివాదం చక్కబడినట్లేనని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో పాటను రిలీజ్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version