Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్‌.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్‌.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్‌!

    Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్‌.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్‌!

    December 27, 2024

    తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు నేతృత్వంలో ఇండస్ట్రీకి చెందిన 36 మంది ప్రముఖులు సీఎం కలిసి పలు అంశాలపై చర్చించారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. అయితే సీఎంను కలిసిన వారిలో ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడాన్ని ప్రముఖ నటి పూనం కౌర్ ప్రశ్నించింది. మరో నటి మాధవిలత నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సమస్యలు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్న సమయంలో హీరోయిన్స్‌ చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

    రేవంత్‌కు సూటి ప్రశ్నలు..

    టాలీవుడ్‌ నటి మాధవిలత (Actress Madhavi Latha).. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టింది. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై సూటిగా ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ‘అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు. ఘటనపై సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంది. కొడంగల్లో సీఎం కుటుంబ సభ్యుల వల్ల ఓ రైతు సూసైడ్ చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు కాకపోయినా రూ.25 వేలు అయినా ఇచ్చారా?. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం చేశారా?. జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని భావిస్తున్నారు’ అంటూ నటి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మాధవిలత BJPలో ఉన్నందున ఆ పార్టీ ప్రతినిధిగా తీవ్ర ఆరోపణలు చేశారని పొలిటికల్‌ వర్గాలు చెబుతున్నాయి.

    మహిళలకు సమస్యలు లేవా?

    గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో జరిగిన సినీ పెద్దల భేటిపై నటి పూనం కౌర్‌ (Poonam Kour) తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక్క మహిళా ప్రతినిధి లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు’ అంటూ ఎక్స్‌ వేదికగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. 

    ‘సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి’

    క్యాన్సర్‌ బారిన పడ్డ తన బిడ్డకు తారక్‌ సాయం చేస్తానని మాటిచ్చి చేయలేదని ఓ మహిళ మాట్లాడిన వీడియో ఇటీవల పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది. దీనిపై స్పందించిన నటి మాధవిలత నెట్టింట ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బులిస్తూ పోతే హీరోలు రోడ్డునపడి అడుక్కుతినాలి. అభిమాని అంటే ఆశించే వాడు కాదు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది.. కానీ, అభిమానం ఎలా అవుద్ధి. ఇంకా రోజుకొకరు మాకు సాయం చేయమని బయటికి వస్తారు. కథలు పట్టుకుని ఫిల్మ్ నగర్‌లో చాలా మంది తిరుగుతుంటారు. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది’ అని మాధవీలత తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు తారక్‌ ఫ్యాన్స్‌ మద్దతిస్తున్నారు.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version