నటీనటులు : లీ జుంగ్ జే, వై హా-జూన్, లీ బైంగ్-హున్, ఇమ్ సి-వాన్, కాంగ్ హా-నెయుల్, లీ జిన్-వూక్, పార్క్ సంగ్-హూన్ తదితరులు
డైరెక్షన్: హ్వాంగ్ డాంగ్ హ్యూక్
సంగీతం : జుంగ్ జే-ఈ
నిర్మాణ సంస్థ : నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ: డిసెంబర్ 26, 2024
వరల్డ్ మోస్ట్ వాంటెడ్ వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్ 2’ (Squid Game 2) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2021లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. తెలుగు, హిందీ సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మెుత్తం ఏడు ఎపిసోడ్స్‌తో అందుబాటులోకి వచ్చింది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సిరీస్ మెప్పించిందా? ప్రీక్వెల్‌ను తలదన్నేలా ఇందులో గేమ్స్ ఉన్నాయా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Squid Game 2 Review In Telugu)
కథేంటి
గత సీజన్‌లో 456 మంది (Squid Game 2 Review In Telugu) ప్లేయర్లతో బ్లడీ బ్లడ్ గేమ్స్‌లో తడపడి హీరో (నంబర్ 456) గెలుస్తాడు. అయితే సీజన్ 2లో కూడా హీరో మరోసారి గేమ్‌లో చేరతాడు. ఈ గేమ్ మాస్టర్ మైండ్ ఎవరిదో కనిపెట్టాలన్న ఉద్దేశ్యంతో తిరిగి అతడు ప్రాణాంతకమైన గేమ్స్‌లోకి దిగుతాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంతోమంది నిస్సహాయులు, అప్పుల పాలైన వారు అత్యాశపరులు గేమ్‌లో పాల్గొంటారు. గత సీజన్‌లో లాగే ఇందులో కూడా గెలిచిన వారు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే.. ఓడినవారు ఎలిమినేట్ అవుతారు. మరి ఈ సీజన్‌లో విన్నర్ ఎవరు? ఎలాంటి గేమ్స్ నిర్వహించారు? గేమ్స్ సూత్రధారిని హీరో కనిపెట్టాడా? అందుకోసం అతడు వేసిన ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది సిరీస్ స్టోరీ.
ఎవరెలా చేశారంటే
‘స్క్విడ్ గేమ్ 2’లో చేసినవారంతా కొరియన్స్ నటీనటులు. కథానాయకుడైన నంబర్ 456 పాత్రలో లీ జుంగ్ జే ఆకట్టుకున్నాడు. గేమ్స్ సందర్భంగా అతడు చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. గేమ్స్ పేరుతో ప్రాణాలు హరీస్తున్న వారిని పట్టుకునే క్రమంలో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మెప్పిస్తాయి. మిగిలిన పాత్రల్లో నటించిన కొరియన్ యాక్టర్స్.. వై హా-జూన్, లీ బైంగ్-హున్, ఇమ్ సి-వాన్, కాంగ్ హా-నెయుల్, లీ జిన్-వూక్, పార్క్ సంగ్-హూన్, యాంగ్ డాంగ్-గెన్, జో యు-రి, కాంగ్ ఏ-షిమ్, లీ సియో-హ్వాన్ ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. తమ సహజమైన నటనతో సిరీస్‌లో లీనమయ్యేలా చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 (Squid Game 2 Review In Telugu)లో మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్నాయి. దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యూక్ చాలా చప్పగా సెకండ్ సిరీస్‌ను ప్రారంభించారు. పాత్రల పరిచయానికే తొలి రెండు ఎపిసోడ్స్ తీసుకోవడం విసుగు తెప్పించింది. ప్లేయర్ నంబర్ 456 తప్ప మిగిలిన అందరూ కొత్త ప్లేయర్లు కావడంతో సిరీస్‌కు కనెక్ట్ కావాడానికి కొంత సమయం పట్టింది. మూడో ఎపిసోడ్ నుంచి అసలైన స్టోరీ మెుదలైనప్పటికీ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తొలి సీజన్‌లో ఉన్నంత రక్తపాతం సెకండ్ సీజన్‌లో కనిపించదు. గేమ్స్‌లో కొత్తదనం లేకపోవడం మరో మైనస్‌గా చెప్పవచ్చు. అయితే ఓ గేమ్ మాత్రం ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఇక క్యారెక్టర్లు, వారి ఉపకథలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ‘స్క్విడ్ గేమ్ 2’ నచ్చుతుంది. గత సీజన్‌తో పోల్చుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Squid Game 2 Review In Telugu) టెక్నికల్ టీమ్ మంచి పనితీరు కనబరిచింది. గేమ్స్ కోసం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ క్రియేట్ చేసిన సెట్స్ మెప్పిస్తాయి. సంగీతం కూడా బాగుంది. ఉత్కంఠభరిత సన్నివేశాల్లో వచ్చే BGM ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. ఎపిసోడ్స్ మరి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- ఉత్కంఠరేపే గేమ్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్
- తొలి రెండు ఎపిసోడ్స్
- సాగదీత సన్నివేశాలు
- మిస్ అయిన ఫస్ట్ సీజన్ మార్క్
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!