Yash Appeal: ఆ ఒక్క గిఫ్ట్‌ ఇవ్వండి చాలు… అభిమానులకు యశ్ విజ్ఞప్తి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Yash Appeal: ఆ ఒక్క గిఫ్ట్‌ ఇవ్వండి చాలు… అభిమానులకు యశ్ విజ్ఞప్తి

    Yash Appeal: ఆ ఒక్క గిఫ్ట్‌ ఇవ్వండి చాలు… అభిమానులకు యశ్ విజ్ఞప్తి

    December 31, 2024

    కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ యశ్‌ (Yash).  తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక అనూహ్య విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఫ్యాన్స్ తన పుట్టినరోజును గ్రాండ్‌గా జరపకుండా, సాదాసీదాగా నిర్వహించాలని కోరుతూ ఒక సందేశాన్ని షేర్ చేశారు.

    యశ్‌ సందేశం

    యశ్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిర్వహించే వేడుకలు,  ఏర్పాటు చేసే కటౌట్‌లు, భారీ ఈవెంట్లకు సంబంధించి తన అభిప్రాయాన్ని యశ్‌ వ్యక్తం చేశారు. “కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త ఆశయాలతో, కొత్త నిర్ణయాలతో జీవితం మొదలుపెట్టాలి. మీ అందరి ప్రేమ, అభిమానం గతంలో నన్ను ఎంతగానో ఆనందపరిచింది. అయితే, కొన్ని సంఘటనలు నన్ను కలిచివేశాయి. ఇప్పుడు మన ప్రేమను చూపించే భాషను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా నా పుట్టినరోజు వేడుకల విషయంలో, బహిరంగ ఈవెంట్స్‌ను నిర్వహించకుండా, ప్రతి ఒక్కరు సురక్షితంగా జీవించి నాకు బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను,” అని ఆయన తన సందేశంలో తెలిపారు.

    2023లో జరిగిన విషాదం

    రెండేళ్ల క్రితం జనవరి 8న యశ్ పుట్టిన రోజు సందర్భంగా  అభిమానులు భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌తో ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన యశ్‌ను తీవ్రంగా కలచివేసింది. బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని వారి బాధ్యతను తీసుకుంటానని యశ్‌ ప్రకటించారు. “ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో నా పుట్టినరోజు దగ్గరపడుతుండగానే నాకు భయం వేస్తోంది,” అంటూ మీడియా ముందు భావోద్వేగంతో మాట్లాడారు.

    యశ్‌ విజ్ఞప్తి

    తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఇప్పటికే నిర్ణయించుకున్న యశ్‌, ఈసారి షూటింగ్‌ కారణంగా సిటీలో కూడా ఉండనని తెలిపారు. “మీరు హృదయపూర్వకంగా ఇచ్చే శుభాకాంక్షలు నాకు ఎంతో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని అందిస్తాయి. మీ ఆనందమే నా ఆనందం,” అంటూ పేర్కొన్నారు.

    ‘టాక్సిక్‌’ షూటింగ్‌లో యశ్ బిజీ

    ‘కేజీయఫ్‌ 2’ విడుదలైన(2022) తర్వాత యశ్‌ నుంచి కొత్త సినిమా రాలేదు.  దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్‌’ (Toxic) అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1950-70ల మధ్య కాలంలో డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం 2025 ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా ఉంచాలని, ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని కోరుతూ యశ్‌ అభిమానులకు ముందుగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన సందేశం ద్వారా అందరికీ ఒక చక్కటి సందేశాన్ని అందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version