This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!

    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!

    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు

    ఆ ఒక్కటీ అడక్కు

    అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

    ప్రసన్న వదనం

    సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు? అస‌లు హంత‌కుడ్ని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడు? అనేదే క‌థ‌.

    శబరి

    వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తెలుగులో వరలక్ష్మీ చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ఇదేనని పేర్కొంది. 

    బాక్‌

    ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak). తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలు.  ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది.

    జితేందర్‌రెడ్డి

    యువ నటుడు రాకేశ్‌వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. దర్శకుడు విరించి వర్మ.. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

    ప్రణయ విలాసం

    ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం (Pranaya Vilasam) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్‌ 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్‌ రోల్‌లో నటించాడు. 

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    The Idea Of YouMovieEnglishAmazon PrimeMay 2
    The WheelSeries EnglishDisney + HotstarApril 30
    DeArMovieTelugu/TamilNetflixApril 28
    Boiling Point – 1SeriesEnglishNetflixApril 29
    Heera MandiSeriesHindiNetflixMay 1
    Sithan MovieHindiNetflixMay 3
    The A Typical FamilySeriesKorean/English NetflixMay 4
    Hacks 3SeriesEnglishJio CinemaMay 3
    VonkaMovieEnglishJio CinemaMay 3
    The Tattooist of AuschwitzSeriesEnglishJio CinemaMay 3
    Migration MovieEnglishJio CinemaMay 1
    Acapulco S3SeriesEnglishApple Plus TVMay 1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version