‘ఆకాశం నీ హద్దురా’ సినిమా 2020లో కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజైంది. థియేటర్‌లో విడుదలైతే ఇంకా భారీ ఎత్తున కలెక్షన్లను సాధించేదని విశ్లేషకుల అంచనా. డెక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత జీఆర్ గోపినాథన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అమెజాన్ ప్రైమలో తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఇది కచ్చితంగా ఉంటుంది.
సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సినిమాలో హీరో పోరాడుతుంటాడు. ‘సింప్లి ఫ్లయ్’ అనే పుస్తకం ఆధారంగా ర్శకురాలు సుధ కొంగర తెరకెక్కంచిన ఈ చిత్రం సగటు సినీ ప్రేక్షకుడిని అమితంగా మెప్పించింది. హీరో సూర్య తన నటనతో సినిమాకు జీవం పోశాడు. హీరోయిన్ అపర్ణ బాల మురళి ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంతగా ప్రభావం చూపించింది.
నిజ జీవిత కథలు ప్రేక్షకులకు హత్తుకుంటాయి. వాటిని తెరకెక్కించడంలోనే అసలైన సవాలు ఎదురవుతుంది. కానీ సుధా కొంగర అందులో విజయం సాధించింది. మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFM) 2021లో ఈ సినిమాలో ఉత్తమ నటనకు గానూ సూర్య, ఉత్తమ సినిమా విభాగాల్లో డైరెక్టర్ సుధా కొంగర అవార్డులను అందుకున్నారు. ఈ మూవీని సూర్య తన సొంత నిర్మాణ సంస్థలో హిందీలో రీమేక్ చేయనున్నాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్