కొండ‌పొలం మూవీ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొండ‌పొలం మూవీ రివ్యూ

    కొండ‌పొలం మూవీ రివ్యూ

    July 20, 2022

    కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో చిత్రం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంత‌కుముందు చేసిన క్యారెక్ట‌ర్స్‌కు విభినంగా పూర్తిగా ప‌ల్లెటూరి పిల్ల‌లా క‌నిపించింది. ఇక సినిమా విష‌యానికొస్తే.. అడ‌వికి, మ‌నిషి వ్య‌క్తిత్వానికి అనుసంధానం చేస్తూ క‌థ సాగుతుంది. 

           కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో చిత్రం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంత‌కుముందు చేసిన క్యారెక్ట‌ర్స్‌కు విభినంగా పూర్తిగా ప‌ల్లెటూరి పిల్ల‌లా క‌నిపించింది. ఇక సినిమా విష‌యానికొస్తే.. అడ‌వికి, మ‌నిషి వ్య‌క్తిత్వానికి అనుసంధానం చేస్తూ క‌థ సాగుతుంది.

          ఇంట‌ర్వ్యూలో కాన్ఫిడెన్స్ లేక‌పోవ‌డం కార‌ణంగా ఉద్యోగం రాక నాలుగేళ్లు ప్ర‌య‌త్నించి ఇంటికి తిరిగివ‌స్తాడు ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌). అత‌డు ఒక‌ గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువ‌కుడు. ఇంటికి వ‌చ్చాక‌ తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అక్క‌డ ఓబుల‌మ్మ‌(ర‌కుల్ ప్రీత్ సింగ్) క‌లుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యువ‌కుడికి అడ‌వి ఏం నేర్పింది?  గొర్రెల్ని కొండ‌పొలానికి తీసుకెళ్లి వ‌చ్చాక అత‌నిలో వ‌చ్చిన మార్పేమిటి? త‌ర్వాత ఉద్యోగం సంపాదించాడా.. ఓబుల‌మ్మ‌తో ల‌వ్‌స్టోరీ ఎలా సాగింది..తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

             న‌ల్ల‌మ‌ల నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంది. అన్నింటికి భ‌య‌ప‌డుతుండే ఓ కుర్రాడికి..అడ‌వికి వెళ్లాక అంత ఆత్మ విశ్వాసం ఎలా వ‌చ్చింది. అడ‌వి నుంచి ఏం నేర్చుకున్నాడ‌ని చెప్ప‌డంతోపాటు అడ‌వి ఎంత గొప్ప‌దో, దాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్యత మ‌న‌పై ఎంత ఉందో చెప్పేలా ఉంటుంది క‌థ‌.  గొర్రెల కాపరుల జీవితాలను తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ మొద‌ల‌య్యే ఈ క‌థ‌… అడ‌విలోకి వెళుతున్న‌ కొద్దీ.. ప్ర‌యాణం సాగుతున్న‌ కొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.  హీరోకి ఎదుర‌య్యే ఒక్కో స‌వాల్‌… ఒక్కో వ్య‌క్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది.

        ఆరంభంలో పిరికివాడిగా క‌నిపించిన యువ‌కుడు… అడ‌విలో ప్ర‌యాణం చేస్తున్న కొద్దీ   ధైర్య‌శాలిగా మారే క్ర‌మం ఆస‌క్తికరంగా ఉంటుంది.  ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది. వైష్ణ‌వ్‌తేజ్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా చాలా స‌హ‌జంగా న‌టించాడు. హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంది.  ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ త‌న పాత్ర‌లో ఒదిగిపోయింది.  సాయిచంద్‌, ర‌విప్ర‌కాశ్, కోట శ్రీనివాస‌రావు, మ‌హేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మాట‌లు, పాట‌లు సినిమాకి బ‌లాన్నిచ్చాయి. 

    ఇక చివ‌రిగా అడ‌వి నేప‌థ్యంలో సాగే క‌థ,  వైష్ణవ్‌ తేజ్ న‌ట‌న, కీర‌వాణి సంగీతం,  క్లైమాక్స్‌ సినిమాకు ప్ల‌స్ అని చెప్ప‌వ‌చ్చు. 

    రేటింగ్ 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version