హ్యాపీ బ‌ర్త్‌డే త‌ణికెళ్ల భ‌ర‌ణి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బ‌ర్త్‌డే త‌ణికెళ్ల భ‌ర‌ణి

    హ్యాపీ బ‌ర్త్‌డే త‌ణికెళ్ల భ‌ర‌ణి

    July 20, 2022

    © File Photo

    న‌టుడు, స్క్రీన్‌రైట‌ర్‌, డైలాగ్ రైట‌ర్‌, ద‌ర్శ‌కుడు త‌ణికెళ్ల భ‌ర‌ణి జులై 14, 1954న హైద‌రాబాద్‌లో జ‌న్మించారు. అత‌డి పూర్వీకులు ర‌చ‌యిత‌లు కావ‌డంతో భ‌ర‌ణికి కూడా ర‌చ‌న అల‌వాటుగా మారింది. అత‌డి కంచు క‌వ‌చం అనే సినిమాతో 1984లో డైలాగ్ రైట‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టాడు. ఆ త‌ర్వాత లేడీస్ టైల‌ర్, చెట్టు కింద ప్లీడ‌ర్ శివ వంటి సినిమాల‌కు ప‌నిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. న‌టుడిగా అత‌డికి ఒక ప్ర‌త్యేకంగా ఉంది. కామెడీ రోల్స్‌తో పాటు సీరియ‌స్ పాత్ర‌ల్లోనూ, ఎమోష‌న‌ల్‌గా న‌టించ‌డంలోనూ త‌నికెళ్ల భ‌ర‌ణికి ఎవ‌రూ సాటిరారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల్లో క‌లిపి మొత్తం 750కి పైగా చిత్రాల్లో న‌టించాడు. ప‌ర‌మ శివ‌భ‌క్తుడైన త‌ణికెళ్ల భ‌ర‌ణి శివుడిపై పాట‌లు, ప‌ద్యాలు రాస్తుంటాడు. డైరెక్ట‌ర్‌గా ప్ర‌ముఖ దివంగ‌త సింగ‌ర్ ఎస్‌.పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, ల‌క్ష్మీతో తెర‌కెక్కించిన మిథునం మూవీకి నంది అవార్డు ల‌భించింది. దీంతో పాటు ఆయ‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 నంది అవార్డుల‌తో పాటు 11 ఇత‌ర పుర‌స్కారాల‌ను అందుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version