టూరిస్టుులూ… నల్లమల అందాలు చూసేందుకు రెడీనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టూరిస్టుులూ… నల్లమల అందాలు చూసేందుకు రెడీనా?

    టూరిస్టుులూ… నల్లమల అందాలు చూసేందుకు రెడీనా?

    November 16, 2021
    in Travel

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల ప్రాచీనతను, సౌందర్యాన్ని ఎంత వివరించినా తక్కువే. దాని అందాలను తెలుసుకోవాలంటే నేరుగా వెళ్లి సందర్శించాల్సిందే. ఇక టూరిస్టు లవర్లకు ఈ ప్రదేశంలో ఉండే ఫారెస్ట్ క్యాంపుల సదుపాయాల విపరీతంగా నచుతాయి. ఇక్కడ ఉండే విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాం..!

    హైదరాబాద్ నుండి 5 గంటల 45 నిమిషాల దూరంలో ఉండే నల్లమల పాచెర్ల ఫారెస్ట్ క్యాంపు కచ్చితంగా ప్రకృతి ప్రేమికులు సందర్శించవలసిన స్థలం. అక్కడ ఉన్న వారు నంద్యాల, గిద్దలూరు పట్టణాల మధ్య ఉండే రాచర్ల జంగల్ క్యాంప్ నుండి మహానందికి కూడా వెళ్ళవచ్చు. అంతేకాకుండా బైర్లుటీ తెగ దగ్గర ఉండే మరొక ఫారెస్ట్ కూడా ఎంతో ప్రసిద్ధి. 

    ఈ క్యాంపులో సుందరమైన రిసార్ట్ భవనాలను కూడా టూరిస్టుల కోసం కట్టి ఉంచారు. వీరందరికీ ట్రేక్కింగ్ (Trekking) సదుపాయం కూడా కల్పించబడుతుంది. ఎత్తైన కొండలను తగిన జాగ్రత్తలతో ఆసక్తి ఉన్నవారు అధిరోహించవచ్చు. ఆ కొండలపై నుండి నల్లమల అందాలను చూసిన వారు ఈ ప్రపంచాన్ని మైమరచిపోతారు. ఎంతో ఆహ్లాదంగా కొండల మధ్య పారే నదులు, అంతేకాకుండా కొండలపై నుంచి జాలువారే జలపాతాలు కూడా మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

    ఇక అక్కడ ఉండే మల్లికార్జున స్వామి దేవాలయం, మిగిలిన ప్రాచీన దేవాలయాలు భక్త పారవశ్యంలో మునిగిపోవడానికి తోడ్పడుతాయి. ఆటపాటల పై ఆసక్తి ఉన్నవారికి కూడా ఇక్కడ మరిన్ని సదుపాయాలు ఉన్నాయి. విలువిద్య (ఆర్చరీ) వచ్చినవారు, నేర్చుకోవాలి అనుకుంటున్న వారు, ఆసక్తి ఉన్నవారికి ఆర్చరీ క్యాంపులు కూడా ఉన్నాయి. అక్కడి స్థానిక తెగల ప్రత్యేక శిక్షణ లో వీటిని చక్కగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళ ఫైర్ క్యాంపులు పెట్టి ఆటపాటలతో మునిగితేలడం వీరి ప్రత్యేకత.

    వీటన్నింటి కంటే మరింత ముఖ్యమైనది, ఎంతో ప్రాచుర్యం పొందినది నల్లమల్ల జంగిల్ సఫారీ. కుటుంబమంతా కలిసి ఈ సఫారీ జీప్ లో వెళ్లి అడవి లోని అన్ని రకాల జంతువులను చూడవచ్చు. అక్కడి తెగల వారికి ప్రత్యేక పర్యవేక్షణ లో ఉండి కూడా మనం క్రూర మృగాలను చూడవచ్చు. నిజంగా వాటి మధ్య మనం తిరుగుతున్న మన ఫీలింగ్ కలిగించే ఈ జంగిల్ సఫారీ ఇక్కడ ఉన్న అన్నింటిలోకి హైలైట్ అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఛలో నల్లమల..!

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version