‘పుష్ప’ మూవీ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పుష్ప’ మూవీ రివ్యూ

    ‘పుష్ప’ మూవీ రివ్యూ

    July 20, 2022

    సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో ‘పుష్ప’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి ఓ భారీ అంచనాలు ఉండటంతో అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. సమంత ఐటం సాంగ్, అల్లు అర్జున్ మేనరిజం, సుకుమార్ మ్యాజిక్ మరోసారి చూడొచ్చని అంచనాకొచ్చారు థియేటర్లలో సందడి చేశారు. కాని అసలు సినిమా ఎలా ఉంది..? అనుకున్న స్థాయిని అందుకుందా..? అల్లు అర్జున్ అదరగొట్టాడా..? తదితర ఆసక్తికర అంశాలు తెలియలంటే ఈ రివ్యూ చూసేయండి.

    అసలు కథేంటి..?

    సింహాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని కొండారెడ్డి, జక్కారెడ్డి, జాలిరెడ్డి బ్రదర్స్ అక్రమంగా ఇతర దేశాలకు రవాణా చేస్తుంటారు. వీరి వద్ద రోజువారి కూలీగా పుష్పరాజ్(అల్లు అర్జున్) పని చేస్తుంటాడు. దినసరి కూలీగా చేరిన ఇతను తన సామర్థ్యంతో రెడ్డి బ్రదర్స్ స్థాయికి ఎదుగుతాడు. వారితో కలిసి వ్యాపారం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే శ్రీవల్లి(రష్మిక మంధాన)తో లవ్ ట్రాక్ కూడ నడిపిస్తాడు. డాన్‌గా కొనసాగుతున్న పుష్పరాజ్ ఒక్కసారిగా మంగళం శ్రీను(సునీల్), బన్వర్ సింగ్ షెకావత్ నుంచి పెద్ద సమస్య ఎదుర్కొంటాడు. అసలు ఆ సమస్య ఏంటి..? దానిని పుష్పరాజ్ ఎలా అధిగమించాడు..? పుష్ప-శ్రీవల్లి మధ్య లవ్‌ట్రాక్ ఎలా సాగింది..? అనేది థియేటర్లలో చూడాల్సిందే.

         సినిమా రిలీజ్‌కి ముందు అల్లు అర్జున్, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ గెటప్‌లు ఓ రేంజ్‌లో కనిపించే సరికి అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెంచుకున్నారు. కాని అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటన తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకునే అంశాలేమి కనిపించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలకు ఆకట్టుకునే మ్యూజిక్ అందిచినప్పటికీ BGMను ప్రభావవంతంగా ఇవ్వలేకపోయాడు. అలాగే VFX, తదితర సాంకేతిక సమస్యలు, కథ సాగదీత సినిమాకు మైనస్‌గా మారాయి. సమంత ఐటం సాంగ్ కొంచెం పర్వాలేదనిపించినప్పటికీ.. శ్రీవల్లి లవ్‌స్టోరీ రోటీన్‌గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో విలనిజం పాత్రలు పోషించిన రావు రమేశ్, అజయ్ గోష్, సునీల్ పాత్రలు పెద్దగా ఆకట్టులేకపోయారు. ఫహద్ ఫాజిల్ చివరి 30 నిమిషాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అదిరిపోయే నటన చేశాడు. సినిమాలో అనసూయ పాత్రకు స్కోపు చాలా తక్కువగా ఉంది. రంగస్థలం మూవీలాగానే కొంచెం విలేజ్ బ్యాక్‌డ్రాప్ కనిపించినప్పటికీ పుష్ప పార్ట్-1లో సుకుమార్ మ్యాజిక్ కనిపించలేదు. కొంచెం యాక్షన్ సీన్లు, కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

    నటీనటుల పాత్రలు- పనితీరు

    అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజీ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఊర మాస్ గెటప్‌తో ఆద్యంతం ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా నటించాడు. శ్రీవల్లి పాత్రకు రష్మిక మంధాన న్యాయం చేసినప్పటికీ ఆమె నిడివి చాలా తక్కువగా ఉంది. సమంత ఐటం సాంగ్ కొంత సినిమాకి ప్లస్‌గా మారింది. సునీల్ గెటప్ బాగున్నా యాక్టింగ్ అంతంతమాత్రంగానే సాగింది. రావు రమేశ్ మార్క్ నటన ఇందులో కనిపించలేదు. అనసూయ పాత్రకు ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంది.

    బలాలు

    1. అల్లు అర్జున్ ఓ రేంజ్ యాక్టింగ్
    2. సామీ సామీ, శ్రీవల్లి, ఊ అంటావా మామా సాంగ్స్
    3. ఫస్ట్‌ఆఫ్ లవ్ ట్రాక్
    4. ఇంట్రవల్ సీన్
    5. ఫాహద్ ఫాజిల్ ఎంట్రీ
    6. రూరల్ బ్యాగ్రౌండ్ సెటప్

    బలహీనతలు

    1. ఆకట్టుకోలేని బ్యాగ్రౌండ్ మ్యూజిక్
    2. కథ సాగదీతగా అనిపించడం
    3. విజువల్ ఎఫ్టెక్స్ ప్రభావం చూపకపోవడం
    4. సుకుమార్ మ్యాజిక్ మిస్ అవ్వడం
    5. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోకపోవడం

    రేటింగ్ : 3.0\5

    ఈ విషయాలు తెలుసా..?

    1. అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదేకావడం విశేషం
    2. ఆర్య, ఆర్య-2 అనంతరం 12 ఏళ్ల తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో ఈ మూవీ రిలీజైంది
    3. మారేడుమిల్లి అడవుల్లో నటీనటులను తీసుకెళ్లడానికి 300 వాహనాలకు వాడారు
    4. ఫస్ట్ డే షూటింగ్‌కే 1500 మందిని ఉపయోగించారు
    5. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా చేసిన మిరోస్లా కూబా బ్రోజెక్ పోలెండ్‌కు చెందిన వ్యక్తి కావడం విశేషం.
    6. సినిమాలో ఓ యాక్షన్ సీన్ కోసం రూ.6 కోట్లు ఖర్చు చేశారట.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version