1945 మూవీ రివ్యూ..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1945 మూవీ రివ్యూ..

    1945 మూవీ రివ్యూ..

    July 20, 2022

    ఎటువంటి పబ్లిసిటీ లేకుండా డైరెక్టుగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా 1945. ఈ మూవీలో రానా వంటి పెద్ద స్టార్ నటించినా, దేశభక్తి అంశంతో కథ ఉన్నా కానీ దర్శకుడు మాత్రం కథను ఆసక్తిగా మలచడంలో విఫలమయ్యాడు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. 

    కథేంటంటే.. 

    1945లో పరిస్థితులు ఎలా ఉండేవనేదే ఈ సినిమా పాయింట్. ఇక ఈ సినిమాలో రానా నటించిన తీరు అంతగా నచ్చదు. కొన్ని సీన్లలో పరవాలేదనిపించిన అతను మరికొన్ని సీన్స్‌లో మాత్రం బాగా నటించలేదు. ఆది (రానా) తన కుటుంబ బిజినెస్ చూసుకునేందుకు అప్పట్లో బర్మా వెళ్తాడు. ఇక రానాకు బ్రిటీష్ తహసీల్దార్ అయిన నాజర్ కుమార్తె (రెజీనా)తో నిశ్చితార్థం జరుగుతుంది. అప్పటికే బ్రిటిషర్ల ఆగడాలు పెచ్చు మీరుతాయి. అటువంటి సమయంలో రానా ఏం చేశాడన్నదే మిగతా కథ. 

    సీనియర్ నటులున్నా.. 

    ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్ వంటి సీనియర్ నటులున్నా కానీ దర్శకుడు సత్య శివ మాత్రం సినిమాను రక్తి కట్టించడంలో తడబడ్డాడు. మనం ఏదైనా దేశభక్తి మూవీ చూస్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది జరగలేదు. కథను రక్తికట్టించడంలో దర్శకుడు తీవ్రంగా ఫెయిలయ్యాడు. రానా డబ్బింగ్ చెప్పకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. ఇక ఈ సినిమాలో నటించిన కమెడియన్ సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. 

    పరవాలేదనిపించిన యువన్

    ఈ సినమాకు యంగ్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. తన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో యువన్ పరవాలేదనిపించాడు. ఇక అనంత శ్రీరామ్ రాసిన పాటలు కూడా పరవాలేదనిపిస్తాయి. 

    కూర్చోబెట్టని ‘1945’

    ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏదైనా సినిమా ప్రేక్షకున్ని కుర్చీలోంచి లేవకుండా కూర్చోబెడితేనే విజయం సాధిస్తుంది. కానీ 1945 విషయంలో మాత్రం అది జరగలేదు. ఏదో పోస్టర్లలో రానా ఉన్నాడని సినిమాకు వెళ్లిన జనాలకు కూడా విసుగుపుట్టేలా కథనం సాగుతుంది. 

    రేటింగ్: 1.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version