2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  December 29, 2022

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి. 

  రామ్ – భీమ్‌

  ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా ఈ ఏడాది టాలీవుడ్ చరిత్ర ఉండదు. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. 

  సినిమా ప్రారంభంలో 2 వేల మందితో జరిగే ఫైట్‌లో చరణ్ కళ్లు ఎంత భావోద్వేగంతో ఉంటాయో క్లైమాక్స్ పూర్తయ్యేంత వరకు అదే ఎమోషన్‌తో నటించడం అద్భుతం. 

  నిజంగా ఓ వ్యక్తి గిరిజన గూడెం నుంచి వస్తే  ఎలా ఉంటాడు?. అడవి మృగాల మధ్య పెరిగిన వ్యక్తి పోరుకు దిగితే ఎలా ఉంటుంది? అని అడిగితే ఎన్టీఆర్‌ను చూపించవచ్చు. కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్‌ హావభావాలకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. 

  గురు రా !

  సినిమాల్లో పాత్ర నచ్చితే చాలు ఆలోచించకుండా చేసే నటుడు ఆది పినిశెట్టి. 2022లో గుడ్ లఖ్ సఖీ అంటూ ఓ ప్రేమికుడిగా మరిపించి తర్వాత ‘గురూ రా’ అంటూ మరోసారి ఇరగదీశాడు ఈ విలన్‌.  ది వారియర్‌లో విశ్వరూపం అస్సలు మర్చిపోలేరు. 

  టిల్లుగాడి హంగామా

  ఏడాది మెుత్తం ఎక్కడ చూసిన టిల్లు అన్న మాటలే. సిద్ధూ జొన్నల గడ్డను అందరూ టిల్లు అని పిలుస్తున్నారంటే ఆ పాత్ర ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ కొట్టిందంటే ఇందులోని టిల్లు, రాధిక పాత్రలే అందులో నటించిన నటీనటులే కారణం.  

  జగత్ జజ్జరిక బింబిసార

  నటనంటే నందమూరి కుటుంబానికి కొత్త కాదన్నట్లుగా బింబిసార చిత్రంలో కల్యాణ్ రామ్ యాక్టింగ్ చేశాడు. పౌరాణిక పాత్రలో చెప్పిన డైలాగ్‌ డిక్షన్‌ అందరిని అలరించింది. బింబిసారుడి పాత్రను గుర్తుండిపోయేలా చేసింది.

  మేజర్ 

  26/11 అటాక్‌లో అసువులుబాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన పాత్రలో అడివి శేష్ నటన మర్చిపోలేం. సందీప్‌లాగే నటించేందుకు శేష్ చాలానే కష్టపడ్డాడు. అటు ప్రేమ, ఇటు సాహహంతో కూడిన ఈ పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరేమో.

  కుచ్లూ

  అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన ఒకే ఒక జీవితంలో శర్వా నటన సూపర్. సెటిల్‌ ఎమోషన్‌తో చివరి వరకు పాత్రలో లీనమై నటించాడు. సినిమా చూస్తున్నంతా సేపు నిజంగానే అతడి జీవితంలో ఆ కథ జరిగింది అనేంతలా జీవించడమే ప్రేక్షకులకు ఇచ్చిన హిట్‌కు అసలు కారణం.

  గాడ్సే, జై దేవ్

  బ్లఫ్ మాస్టర్ సినిమా గుర్తుందా. ఎందుకు మర్చిపోతారు. అందులో సత్యదేవ్ నటన అలా ఉంటుంది. అలాంటి రూట్ వేసుకున్న సత్యదేవ్‌ దేశాన్ని మోసం చేస్తున్న ప్రజాప్రతినిధులపై తిరగబడే గాడ్సే పాత్రలో నటన ఆకట్టుకోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు.

  గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చిరంజీవిని ఢీకొట్టే జై దేవ్‌గా సత్యదేవ్‌ అలరించాడు. క్లైమాక్స్‌లో ఇద్దరి మధ్య సంభాషణలు పేలాయి. ఎంతలా అంటే ఇండస్ట్రీకి చిరంజీవి మరో వారసుడు వచ్చాడంటూ ఓ  ప్రచారమే జరిగింది. 

  ధన్వంతరి వేద్ పాఠక్

  కార్తికేయ 2 చిత్రంలో అనుపమ్ ఖేర్ నటించింది చిన్న పాత్రే. కథను మలుపు తిప్పే సన్నివేశం అది. తెరపై 2 నిమిషాలే కనిపించినా చేసింది గుడ్డివాడి పాత్రే అయినా అనుపమ్‌ ఖేర్‌ నటన ఆ సీన్‌కు గాఢతను తీసుకొచ్చింది. 

  గురు, ఇగో కా బాప్

  తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మానందం తర్వాత స్థానాన్ని వెన్నెల కిషోర్ భర్తీ చేశాడని చెప్పవచ్చు. మాచర్ల నియోజకవర్గంలో ఇగోయిస్ట్‌ పాత్రలో పండించిన కామెడీ అస్సలు మర్చిపోలేరు. సినిమా ఆడకపోయినా వెన్నెల కిశోర్‌ పాత్ర మాత్రం అలరించింది. 

  సరిగ్గా చదువుకునుంటే బాగుండు అని సగం జీవితం గడిచాక అనుకునేవారికి ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో  వెన్నెల కిషోర్ కనిపిస్తాడంతే. 

  భామ కలాపం 

  ఏదో జరుగుతుంది అనే ఆసక్తి. కచ్చితంగా తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్న పాత్రలో ప్రియమణి నటించింది. వంట గది నుంచి అందరి ఇళ్లు స్కాన్‌ చేసి ఓ సమస్యలో పడితే ఎలా ఉంటుందనే క్యారెక్టర్‌ను అమాయకత్వంతో పోషించి మెప్పించింది. 

  ఓ సీత

  సీతారామం సినిమా ప్రస్తావన వచ్చిందంటే అందులో గుర్తొచ్చేది సీత పాత్ర. ఈ క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్‌ జీవించిందనే చెప్పాలి. అందుకే ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. రాజకుటుంబంలో పుట్టి ఓ సైనికుడిని ప్రేమించిన పాత్రలో ఒదిగిపోయిందంటే అతిశయోక్తి కాదు.

  వెన్నెల

  విరాట పర్వం చిత్రంలో అసలు హీరో సాయిపల్లవి. ప్రజల కోసం పోరాడుతున్న రాణాను చూసి ప్రేరేపితురాలై దళంలోకే వెళ్తుంది. అక్కడ వాళ్లకు సహాయ సహకారాలు అందించే పాత్రలోనూ, చివరకు తనను కోవర్టని ముద్రవేసి చంపేసేటప్పుడు చూపించిన ఎక్స్ప్రేషన్స్‌కు ప్రేక్షకులను ఏడ్పించేసింది. 

  గార్గి చిత్రం చివరి వరకు సాయి పల్లవి నటనే హైలెట్. అక్రమ కేసులో ఇరుక్కున్న తండ్రిని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం మనల్ని కట్టి పడేస్తుంది.

  అమ్ము

  తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో విడుదలైన అమ్ము చిత్రం ద్వారానే ఐశ్వర్య లక్ష్మి మరింత చేరువయ్యింది. గృహిణి పాత్రలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆఫర్లు వరుస కట్టాయి. మట్టి కుస్తీ సినిమాలోనూ ఓ పెహల్వాన్‌లా నటించి అలరించింది ఐశ్వర్య

  ముఖ చిత్రం

  ముఖ చిత్రం సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా అందులో మహతి క్యారెక్టర్ చేసి ప్రియా వడ్లమానిని మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో ఎన్ని హావాభావాలు పండించాలో అంతలా నటించి మెప్పించారు మరి. 

  యశోద

  సరోగసి నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథ అది. దాని వెనుక దాగి ఉన్న లోగుట్టును వెతికేపనిలో పడిన పాత్రలో యశోదగా చేసిన సమంత పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. చెల్లి కోసం ఆరాటం, సమస్యల నుంచి బయటపడేందుకు చేసే పోరాటం మైమరిపిస్తాయి.

  డబ్బింగ్ బోనాంజా

  తెలుగులో అనువాద చిత్రాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇందులో విక్రమ్, కాంతారా చిత్రాల్లో వారి నటనలను తెలుగువారు మెచ్చుకున్నారు.

  కమల్‌హాసన్‌ను మించి

  లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిన సినిమాలో కమల్‌హాసన్‌ కంటే ఇతర పాత్రలు చాలా పేలాయి. ఇందులో వారి నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

  విజయ్ సేతుపతి

  సినిమాలో చూడటానికి సాప్ఠ్‌గా కనిపించే విజయ్ సేతుపతి అటూ నవ్విస్తూనే క్రూరమైన విలన్‌గా మెప్పించాడు. ముఖ్యంగా ఆటోలో నుంచి అలా బయటకు పడి చేతులు వెనక్కి పెట్టుకొని నడిచే మేనరిజం బాగా వర్కౌట్‌ అయ్యింది.

  ఏజెంట్ టీనా

  కమల్‌ హాసన్ ఇంట్లో పిల్లాడిని కాపాడుకుంటూ ఏజెంట్‌ టీనా చేసిన పర్‌ఫార్మెన్స్‌ను ఎవ్వరైనా మెచ్చుకోవాల్సిందే. అంతకముందు డాన్సర్‌గా చేసిన టీనా ఈ సినిమాతో పాపులర్ అయ్యింది.

  రోలెక్స్‌

  విక్రమ్ క్లైమాక్స్ సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్. అలాంటిది అక్కడ తెల్లటి చొక్కాలో, దానిపై రక్తం మరకలతో కాల్‌ మీ సర్ అంటూ సూర్య నటనకు తిరుగులేదు. ఎవ్వరూ అంతకన్నా బాగా చేయలేరు. 

  కాంతారా

  కాంతారా చిత్రంలో రిషబ్ షెట్టి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్‌ రిషబ్‌ యాక్టింగ్ పీక్స్‌ అంతే. 

  హీరోలు, విలన్‌లే కాదు కొంతమంది చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. తమ నటనతో మెప్పించారు.

  ఆర్ఆర్ఆర్‌ ‘మల్లి’

  ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభంలోనే కొమ్మ ఉయ్యాలా అంటూ పాటలో మెప్పించిన మళ్లీ. అన్నా గుబులు అవుతుంది ఇక్కడ్నుంచి తొలుకపో అంటూ ఎన్టీఆర్‌తో చేసిన సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. ఈ పాత్రలో మెరిసిన చిన్నారి పేరు ట్వింకిల్ శర్మ.

  బింబిసార శాంభవి

  బింబిసార చిత్రంలో చిన్నారి శ్రీదేవి పోషించిన శాంభవి క్యారెక్టర్ కథకు ప్రాణం. దేవుడికి దీపం పెడితే రాక్షసుడిని చంపేందుకు వస్తాడంటూ ఆ పాప చేసిన నటనను మర్చిపోలేం

  మిషన్ ఇంపాజిబుల్‌

  మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో నటించిన చిన్నారులు గుర్తున్నారా? రఘుపతి , రాఘవ, రాజారం క్యారెక్టర్లలో నటించిన హర్ష రోషన్, బన్ను ప్రకాశన్, జయతీర్థ అందరినీ కట్టిపడేశారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version